AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు.. డ్యాన్స్‌ ఇరగదీస్తుందంతే

ప్రస్తుతం టాలీవుడ్ లోని ఓ క్రేజీ హీరోయిన్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తన చిన్నతనంలో దిగిన ఫొటో. ఇందులో చిరునవ్వులు చిందిస్తూ ఎంతో క్యూట్‌గా ఉన్న అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్‌. ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు.. డ్యాన్స్‌ ఇరగదీస్తుందంతే
Tollywood Actress
Basha Shek
|

Updated on: May 28, 2023 | 9:04 AM

Share

సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న నాటి ఫొటోలు సోషల్ మీడియాలో తరచూ వైరలవుతుంటాయి. ముఖ్యంగా సినిమా తారల విషయంలో ఇప్పుడు త్రో బ్యాక్‌ ట్రెండ్‌ నడుస్తోంది. పుట్టిన రోజు, ఇతర స్పెషల్‌ డేస్‌లో సినిమా తారల తమ చిన్ననాటి ఫొటోలు, అరుదైన ఫొటోలు తరచూ షేర్‌ చేస్తుంటారు. ఫ్యాన్స్‌ కూడా తమ అభిమాన తారల అరుదైన ఫొటోలు చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో ఇవి నెట్టింట్లో ఇట్టే వైరలవుతుంటాయి. అలా ప్రస్తుతం టాలీవుడ్ లోని ఓ క్రేజీ హీరోయిన్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తన చిన్నతనంలో దిగిన ఫొటో. ఇందులో చిరునవ్వులు చిందిస్తూ ఎంతో క్యూట్‌గా ఉన్న అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్‌. ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇక డ్యాన్స్‌లో అయితే ఇరగదీస్తుందంతే. ఆ హీరోయిన్ ని గుర్తు పట్టడం పెద్ద కష్టమేమి కాదు. ఒకవేళ గుర్తుపట్టకపోయినా నో ప్రాబ్లమ్‌.. ఆన్సర్‌ మేమే రివీల్‌ చేస్తాం లేండి. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు జాతిరత్నాలు ఫేమ్‌ ఫరియా అబ్దుల్లా అలియాస్‌ చిట్టీ.

ఇవి కూడా చదవండి

జాతిరత్నాలు సినిమాలో నవీన్‌ పొలిశెట్టితో కలిసి నవ్వులు చిందించిన ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌, బంగర్రాజు సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్‌తో అలరించింది. ఇక లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, రావణాసుర వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం వల్లి మెయిల్ అనే సినిమాలో నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే ఫరియా నిత్యం తన డ్యాన్స్‌ వీడియోలు, గ్లామరస్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. అన్నట్లు ఇవాళ (మే 28) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు చిట్టీకి బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
2027 వన్డే వరల్డ్ కప్‌నకు మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి..?
2027 వన్డే వరల్డ్ కప్‌నకు మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి..?
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం
కరీంనగర్ యువతి సత్తా.. ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొలువు!
కరీంనగర్ యువతి సత్తా.. ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొలువు!
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం సూపర్ స్కీమ్
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం సూపర్ స్కీమ్
దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి
దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి
ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే
ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే
6 తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో అందరికీ ఒకే ఇల్లు.. ఒకే వంట
6 తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో అందరికీ ఒకే ఇల్లు.. ఒకే వంట
శ్రావణ మాసంలో అష్ట లక్ష్మి యోగం.. వీరికి పట్టింది బంగారమే!
శ్రావణ మాసంలో అష్ట లక్ష్మి యోగం.. వీరికి పట్టింది బంగారమే!
చెల్లికి చివరి మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్వ్‌వేర్ ఉద్యోగి
చెల్లికి చివరి మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్వ్‌వేర్ ఉద్యోగి
కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో
కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో