Anchor Shilpa: అప్పట్లో బుల్లితెరను ఏలిన ఈ స్టార్‌ యాంకర్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?

టాలీవుడ్‌ బుల్లితెరపై సత్తాచాటిన యాంకర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అందులో బట్లీ బ్యూటి శిల్పా చక్రవర్తి ఒకరు. హైదరాబాద్‌కు చెందిన తనదైన శైలి యాంకరింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించి మెప్పించింది. స్మాల్ స్ర్కీన్‌పై మెరుస్తూనే నువ్వే నువ్వే లాంటి సినిమాల్లో కూడా కనిపించి ఆకట్టుకుంది.

Anchor Shilpa:  అప్పట్లో బుల్లితెరను ఏలిన ఈ స్టార్‌ యాంకర్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
Anchor Shilpa Chakraborthy
Follow us
Basha Shek

|

Updated on: May 27, 2023 | 8:43 PM

టాలీవుడ్‌ బుల్లితెరపై సత్తాచాటిన యాంకర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అందులో బట్లీ బ్యూటి శిల్పా చక్రవర్తి ఒకరు. హైదరాబాద్‌కు చెందిన తనదైన శైలి యాంకరింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించి మెప్పించింది. స్మాల్ స్ర్కీన్‌పై మెరుస్తూనే నువ్వే నువ్వే లాంటి సినిమాల్లో కూడా కనిపించి ఆకట్టుకుంది. కాగా శిల్పాది బెంగాళీ బ్రాహ్మణ కుటుంబం. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో వారి కుటుంబం ఇక్కడే స్థిరపడింది. ఆమె విద్యాభాస్యం సికింద్రాబాదు లోని రైల్వే స్కూల్, కాలేజ్ లో గడించింది. ఇక శిల్పా మంచి కథక్ నృత్యకారిణి. కాగా మొదట మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ఆ తర్వాత బుల్లితెర వైపు మొగ్గు చూపింది. ‘వావ్: ది అల్టిమేట్ గేమ్ షో’ తో బుల్లితెర యాంకర్‌గా పరిచయమైంది. ఆతర్వాత ‘కంటే కూతురినే కనాలి’ సీరియల్‌లోనూ నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆతర్వాత డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌, భలే జోడీ వంటి టాప్‌ టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించిన శిల్ప  చాలా తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్‌గా ఎదిగిపోయింది. షోలు మాత్రమే కాదు సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లతోనూ సందడి చేసింది.

కాగా యాంకర్‌గా, నటిగా బిజీగా ఉంటున్న సమయంలోనే శిల్పా చక్రవర్తి.. కల్యాణ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆతర్వాత ఇద్దరు పిల్లలకు అమ్మగా మారిపోయింది. ఇక పిల్లల బాధ్యతలు భుజాన పడడంతో తన యాంకరింగ్‌ అండ్‌ యాక్టింగ్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసింది. అయితే 2019లో బిగ్ బాస్ మూడో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ప్రవేశించింది. అయితే రెండు వారాల తర్వాత ఎలిమినేట్‌ అయ్యి బయటకు వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోందీ అమ్మడు. తన ఫ్యామిలీ ఫొటోలును తరచూ షేర్‌ చేస్తుంటుంది. ఇవి చూసిన నెటిజన్లు శిల్ప అందం ఏ మాత్రం తగ్గలేదని, ఇప్పటికీ అలాగే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి శిల్ప లేటెస్ట్‌ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

శిల్పా చక్రవర్తి లేటెస్ట్ ఫొటోస్, వీడియోలు

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..