- Telugu News Photo Gallery Cinema photos Virupaksha Director Karthik Dandu Reveals Sukumar Changes Villain Character In His Movie
Virupaksha: విరూపాక్షలో మెయిన్ విలన్‌గా ముందు ఆ స్టార్ యాంకర్‌ను అనుకున్నారా?
థియేటర్లలో రిలీజై ఏకంగా 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఈ ఇంటెన్స్ న్యాచురల్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము దులుపుతోంది. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటోంది.
Updated on: May 25, 2023 | 4:01 PM

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మేనన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం విరూపాక్ష. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

థియేటర్లలో రిలీజై ఏకంగా 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఈ ఇంటెన్స్ న్యాచురల్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము దులుపుతోంది. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటోంది.

కాగా ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా సంయుక్త మేనన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం సినిమా చూసేంత వరకు ఎవరికీ తెలియదు. మొత్తానికి విలన్ రోల్‌లో హీరోయిన్ సంయుక్త అదరగొట్టిందని చెప్పవచ్చు.

అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా యాంకర్ శ్యామలను మొదటగా అనుకున్నారట. అయితే సుకుమార్ సూచనల మేరకు కార్తీక్ దండు సంయుక్తను మెయిన్ విలన్‌గా మార్చారట.

ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ కార్తీక్. కాగా విరూపాక్ష సినిమాలో యాంకర్ శ్యామల సాయి ధరమ్ తేజ్ సోదరి పాత్రలో నటించింది. ఇందులో ఆమెది సినిమాను మలుపుతిప్పే క్యారెక్టర్.





























