నాని కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు.. అస్సలు మిస్ కావొద్దు బాసూ..
Rajitha Chanti
Pic credit - Instagram
24 February 2026
న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోగా తనదైన ముద్ర వేశారు. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
నానిని హీరోగా మార్చిన సినిమా అష్టా చెమ్మా. అప్పటివరకు సహయ దర్శకుడిగా ఉన్న నాని.. అష్టా చెమ్మ సినిమాతో హీరోగా పరిచయమై మొదటి చిత్రంతోనే ప్రశంసలు అందుకున్నాడు.
అతడి కెరీర్ మలుపు తిప్పిన సినిమా అలా మొదలైంది. ఈ సినిమాలో నాని, నిత్యా మీనన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ చిత్రానికి అడియన్స్ లో ప్రత్యేక స్థానం ఉందంటే అతిశయోక్తి కాదు.
అలాగే నానిని పాన్ ఇండియా స్టార్ హీరోగా మార్చిన సినిమా దసరా. 2023లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మాస్ యాక్షన్ హీరోగా అదరగొట్టారు నాని.
రొమాంటిక్, మాస్ యాక్షన్ చిత్రాలే కాదు.. ఫ్యామిలీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఎమోషనల్ డ్రామాలతోనూ నాని హిట్స్ అందుకున్నాడు. అందులో హాయ్ నాన్న మూవీ ఒకటి.
తండ్రి పాత్రలో నాని యాక్టింగ్ అద్భుతమనే చెప్పాలి. హాయ్ నాన్న కంటే ముందే జెర్సీ సినిమాతో తండ్రిగా భారీ విజయాన్ని అందుకున్నారు. ఇందులో నాని యాక్టింగ్ వెరెలెవల్ అని చెప్పాలి.
ఇక ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నాని నటించిన సినిమా ఈగ. ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అలాగే శ్యామ్ సింగరాయ్ చిత్రంలోనూ నాని ప్రశంసలు అందుకున్నాడు.
ఇవే కాకుండా నాని కెరీర్ లో మరో సినిమా జెంటిల్మెన్. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో మరో ప్రయత్నం చేయడానికి రెడీ అయ్యాడు. తాజాగా కొత్త సినిమా స్టార్ట్ చేశారు.