AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens: మహిళలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.2,500.. రెడీగా ఉండండి..

మార్చి 20న తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే తేదీలు ఖరారయ్యాయి. ఈ బడ్జెట్‌లో పలు కీలక పథకాలను ప్రకటించనున్నారని తెలుస్తోంది. పింఛన్ల పెంపు, మహిళలకు నగదు సాయంపై కేటాయింపులు ఉండొచ్చని సమాచారం. పూర్తి వివరాలు ఇలా..

Womens: మహిళలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.2,500.. రెడీగా ఉండండి..
Money
Venkatrao Lella
|

Updated on: Feb 25, 2026 | 2:35 PM

Share

సంక్షేమ పథకాల అమలుపై తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంపై దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చాక కొన్ని హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చగా.. ఇంకా చాలా హామీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించినా.. కొన్ని హామీలను మాత్రమే అమలు చేసింది. దీంతో మిగతా హామీలను కూడా నెరవేర్చాలని ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. కేవలం ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా రూ.12 వేలకు పెంపు వంటి హామీలను మాత్రమే ఇప్పటివరకు అమలు చేస్తోంది. త్వరలో మరో రెండు హామీలను కూడా నెరవేర్చే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది.

పింఛన్ల పెంపు

వృద్దులకు ఇస్తున్న సామాజిక పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపర్చింది. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పింఛన్ పెంచాలని లబ్దిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు పెంచుతారని ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిని అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్దమైంది. పింఛన్లను రూ.4 వేల పెంపుపై ఆర్థికశాఖ ఇప్పటికే సీఎంకు నివేదిక అందించింది. రూ.4 వేలకు పెంచితే ఎంత అదనపు ఖర్చు అవుతుందనే దానిపై రిపోర్ట్ అందించింది. దీనికి అనుగుణంగా త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. మార్చి 20న తేదీన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ బడ్జెట్‌లో పింఛన్ల పెంపుపై ప్రకటన ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కేటాయింపులు ఉండే అవకాశముందని ప్రచారం సాగుతోంది.

మహిళలకు ప్రతీ నెలా రూ.2,500

18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ప్రతీ నెలా రూ.2,500 ఆర్ధిక సాయం అందిస్తామని ఆరు గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీకి సంబంధించి కూడా బడ్జెట్‌లో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలు చేసేందుకు నిధుల అందుబాటుపై సీఎం రేవంత్ రెడ్డికి ఆర్థికశాఖ నివేదికలు అందించింది. త్వరలో ప్రకటించనున్న బడ్జెట్‌లో ప్రకటన చేయనున్నారని సమాచారం. బడ్జెట్ సమావేశాలకు ముందు జరగనున్న కేబినెట్ సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ రెండు పథకాలు అమలైతే రాష్ట్రంలో లక్షలాది మంది లబ్ది పొందనున్నారు. అటు విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ అందించే పథకంపై కూడా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.

Follow Us