వీరికి చెరకు రసం విషంతో సమానం.. ముట్టుకున్నారో మాటాష్‌!

25  February 2026

TV9 Telugu

TV9 Telugu

మండే ఎండల్లో ఓ గ్లాసు చల్లని చెరకు రసం తాగితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. క్షణాల్లో శరీరం ఉత్తేజితమవుతుంది. ఇందులోని చక్కెరలు, పోషక ఖనిజాలే అందుకు కారణం

TV9 Telugu

చెరకు రసం చవకైనది, రుచిగా కూడా ఉంటుంది. చెరకు రసం కాలేయానికి చాలా ఆరోగ్యకరమైనదిగా ఉంటుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సహజ చక్కెరలతోపాటు అనేక ఇతర పోషకాలు ఉంటాయి

TV9 Telugu

చెరకులో పిండిపదార్థాలు, మాంసకృత్తులతోపాటు పొటాషియం, జింక్‌, ఫాస్ఫరస్‌, క్యాల్షియం, ఐరన్‌ లాంటి ఖనిజాలుంటాయి. విటమిన్‌-ఎ, బి, సి కూడా ఎక్కువే

TV9 Telugu

ఇది అలసట, నిస్సత్తువను తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరాన్ని రీహైడ్రేట్‌ చేస్తుంది. దీనిలోని ఖనిజాలు దంతాలు, ఎముకలకు బలాన్నిస్తాయి. మలబద్ధకాన్ని పారదోలుతుంది. క్రమం తప్పకుండా తాగితే రోగనిరోధకత పెరుగుతుంది

TV9 Telugu

అయితే ఎన్ని పోషకాలు ఉన్నప్పటికీ కొంతమంది దీనిని అస్సలు తాగకూడదు. చెరకు రసం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు దీనిని అస్సలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

జైపూర్ కు చెందిన క్లినికల్ న్యూట్రిషనిస్ట్ సురభి పరీక్ దీని గురించి మాట్లాడుతూ చెరకు రసంలో సాధారణ కార్బోహైడ్రేట్లు ఉన్నాయని, ఇవి తాగిన వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని చెప్పారు

TV9 Telugu

చెరకు రసం ఇతర హానికరమైన ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అయితే దీనిని తయారు చేసే విధానంలో తగిన పరిశుభ్రత పాటించాలి. దీంతో కలరా లేదా ఇతర కడుపు సమస్యలకు దారితీస్తుంది

TV9 Telugu

విరేచనాలుతో బాధపడే వారికి చెరకు రసం ఇవ్వకూడదు. బరువు కూడా పెరుగుతారు. ఇప్పటికే ఊబకాయం ఉన్నవారు చెరకు రసాన్ని తీసుకోకూడదు. ఇందులో చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. సాధారణ కార్బోహైడ్రేట్లు ఉన్నవారికి కూడా ఇది తగనిది