చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరూ భావిస్తారు. దీనిని చెరకు రసం నుంచి తయారు చేస్తారు. సహజంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ వంటి పోషకాలు దండిగా ఉంటాయి
TV9 Telugu
అందుకే తీపి తినాలనుకుంటే చక్కెరకు బదులు బెల్లాన్ని ఉపయోగిస్తుంటారు. రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే బెల్లం మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు
TV9 Telugu
ఇందులో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. బెల్లంలో ఉండే ఇనుము, ఫాస్ఫరస్ రక్తహీనత ఎదురుకాకుండా చేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసే గుణం దీనికి ఉంది
TV9 Telugu
గర్భిణులు బెల్లాన్ని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలు, అలర్జీల బారిన పడకుండా కాపాడుకోవచ్చు
TV9 Telugu
అందుకే రోజుకో చిన్న బెల్లం ముక్క తినే మహిళల్లో నెలసరి సమస్యలు చాలావరకు తగ్గుతాయట. ఇందులో యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే
TV9 Telugu
ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీన్ని తీసుకుంటే మలబద్ధకం సమస్యా ఉండదు. తిన్న ఆహారం సజావుగా జీర్ణం అవుతుంది
TV9 Telugu
బెల్లం తింటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. ఇది డీటాక్సిఫికేషన్ ఏజెంట్‌గా పనిచేసి కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. బరువూ నియంత్రణలో ఉంటుంది
TV9 Telugu
నీరసంగా అనిపించినప్పుడు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే తక్షణ శక్తి వస్తుంది. బెల్లంతో చిక్కీలు, స్వీట్లు, ఎనర్జీ బార్స్.. వంటివి తయారుచేసుకోవచ్చు. అలాగే పాలు, టీలలో చక్కెరకు బదులు బెల్లం వాడడం మంచిదంటున్నారు నిపుణులు