AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండెకి చికిత్స.. హైదరాబాద్ వైద్యుల ఘనత

Hyderabad: హైదరాబాద్ నగరానికి చెందిన 55 ఏళ్ల మహిళకు 2016లో బైపాస్ శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల తక్కువ దూరం నడిచినా తీవ్ర శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు ఛాతి నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. వైద్య పరీక్షల అనంతరం ఆమె గుండెలోని ఒక వాల్వ్ తీవ్రంగా మూసుకొనిపోయింది అని వైద్యులు గుర్తించారు, దీని వల్ల రక్త ప్రసరణ జరగడం కష్టమైంది.

Hyderabad: ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండెకి చికిత్స.. హైదరాబాద్ వైద్యుల ఘనత
Heart Surgery
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Feb 25, 2026 | 12:08 PM

Share

Hyderabad: ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స అవసరం లేకుండా మినిమల్లీ ఇన్వేసివ్ స్ట్రక్చరల్ హార్ట్ ప్రొసీజర్ తో అధిక కన్డక్షన్ రిస్క్ ఉన్నప్పటికీ కచ్చితమైన ప్రణాళికతో సురక్షిత ఫలితం సాధించారు హైదరాబాద్ వైద్యులు. హైదరాబాద్‌లో 55 ఏళ్ల మహిళకు తీవ్రమైన గుండె వాల్వ్ సమస్యను ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స లేకుండా అధునాతన పద్దతిలో శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించామని వైద్యులు తెలిపారు.

నగరానికి చెందిన 55 ఏళ్ల మహిళకు 2016లో బైపాస్ శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల తక్కువ దూరం నడిచినా తీవ్ర శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు ఛాతి నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. వైద్య పరీక్షల అనంతరం ఆమె గుండెలోని ఒక వాల్వ్ తీవ్రంగా మూసుకొనిపోయింది అని వైద్యులు గుర్తించారు, దీని వల్ల రక్త ప్రసరణ జరగడం కష్టమైంది.

ఇప్పటికే ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన ఆమెకు మరొకసారి ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స చేయడం ప్రమాదకరమని భావించిన వైద్య బృందం, TAVI.. ట్రాన్స్‌కాథెటర్ ఆయార్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ అనే మినిమల్లీ ఇన్వేసివ్ శస్త్ర చికిత్స నిర్వహించాలి అని నిర్ణియించామని కామినేని హాస్పిటల్స్, బోగులకుంట కింగ్‌కోఠి బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. పూజా కామినేని తెలిపారు. ఈ విధానంలో కాలిలోని రక్తనాళం ద్వారా చిన్న ట్యూబ్ సహాయంతో దెబ్బతిన్న వాల్వ్‌ను పునరుద్ధరించడం జరుగుతుంది. దీంతో ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స అవసరం ఉండదు.ఈ శస్త్రచికిత్సను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ స్పెషలిస్ట్ డా. సాకేత్ సురేష్ ఖేతాన్ తన బృందంతో కలిసి విజయవంతంగా నిర్వహించారు. బృందంలో కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ డా. చైతన్య, కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ డా. రంగారెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Bank Holidays: కస్టమర్లకు అలర్ట్‌.. మార్చి నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..

ఆధునిక ఇమేజింగ్ సాంకేతికతతో ఈ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా ప్రణాళిక చేశారు. రోగికి గుండె రిథమ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, పేస్‌మేకర్ అవసరం లేకుండానే కొత్త వాల్వ్‌ను విజయవంతంగా అమర్చారు. శస్త్రచికిత్స తర్వాత రెండో రోజుకే ఆమె నడవడం ప్రారంభించారు. మూడో రోజునే తన ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఆధునిక TAVI విధానం విజయవంతం కావడం మా క్లినికల్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్ పట్ల ఉన్న నిబద్ధతను తెలియచేస్తుంది అని తెలిపారు వైద్య బృందం. డా ఆదిత్య బండారు, డా. పూజా కామినేని ఆద్వర్యంలో కామినేని హాస్పిటల్స్, బోగులకుంట, కింగ్‌కోఠి అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందిస్తోంది. అత్యాధునిక సదుపాయాలు, నిపుణుల వైద్య బృందంతో అందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన చికిత్స అందించడం మా ప్రధాన లక్ష్యం అని వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Multibagger: ఈ 5 స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయా.. ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. లక్షకు ఎంతిచ్చాయంటే?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us