AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: ఎగబడ్డ అభిమానులు.. పరిగెత్తి తప్పించుకున్న సాయి పల్లవి

Sai Pallavi: ఎగబడ్డ అభిమానులు.. పరిగెత్తి తప్పించుకున్న సాయి పల్లవి

Phani CH
|

Updated on: Feb 24, 2026 | 8:27 PM

Share

ఇటీవల అభిమానుల అత్యుత్సాహంతో సాయి పల్లవి సెల్ఫీలు, ఫొటోల కోసం చుట్టుముట్టగా, ఆమె తెలివిగా తప్పించుకుంది. ఇది వైరల్ వీడియోగా మారింది. నిధి అగర్వాల్, సమంత, రామ్ చరణ్ వంటి తారలు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అభిమానుల ప్రేమ అధికమైనప్పుడు సెలబ్రిటీలు అసౌకర్యానికి గురవుతారనేది ఈ ఘటనల సారాంశం.

అభిమానుల అత్యుత్సాహంతో ఇటీవల కొందరు సినిమా తారలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నిధి అగర్వాల్, సమంత, మొన్నటికి మొన్న రామ్ చరణ్ తన కూతురుతో క్లింకారతో వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. తాజాగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఇలాంటి సిచ్యువేషనే ఎదురైంది. ఆమెతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు అభిమానులు తెగ పోటీ పడ్డారు. అయితే న్యాచురల్ బ్యూటీ మాత్రం తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. కొందరు అభిమానులు సాయి పల్లవిని చుట్టు ముట్టి ఫొటోలు, సెల్ఫీలు కావాలని అడిగేశారు. వారి ఉత్సాహాన్ని కాదనలేక న్యాచురల్ బ్యూటీ కూడా ఇద్దరు, ముగ్గురికి ఫొటోలు ఇచ్చినట్టే ఇచ్చి… మెల్లిగా అక్కడి నుంచి జంప్ అయిపోయింది. వాళ్ల నుంచి తప్పించుకుంటూ పరిగెత్తి కార్‌ ఎక్కింది. ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సాయి పల్లవిని పట్టడం ఎవరి వల్ల కాదంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సాయి పల్లవి వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటోంది. గత ఏడాది నాగ చైతన్యతో కలిసి ఆమె నటించిన ‘తండేల్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ రామయాణంలో సీతగా నటిస్తోందీ అందాల తార. అలాగే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో కలిసి ఏక్ దిన్ అనే మరో సినిమాలోనూ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది మే 1న ఏక్ దిన్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇక రామయాణం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Naresh and Pavitra: తండ్రి ప్రేమ పెళ్లిపై కొడుకు షాకింగ్ రియాక్షన్

Rajasekhar: ‘నోరు విప్పి అడిగినా.. నాకు ఆ రోల్‌ ఇవ్వలేదు’

Niharika Konidela: ఫిలిం ఫేర్ నిర్వాహకులపై నిహారిక ఫైర్..

అమెరికా వీధుల్లో మహాభారత ‘మయసభ’

రమ్యకృష్ణ కొడుకు ఫిల్మ్ ఎంట్రీ ?? తండ్రి ఏమన్నారంటే..

Follow Us