AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niharika Konidela: ఫిలిం ఫేర్ నిర్వాహకులపై నిహారిక ఫైర్..

Niharika Konidela: ఫిలిం ఫేర్ నిర్వాహకులపై నిహారిక ఫైర్..

Phani CH
|

Updated on: Feb 24, 2026 | 8:13 PM

Share

ఫిలింఫేర్ అవార్డుల తీరుపై నిహారిక కొణిదెల తీవ్రంగా స్పందించారు. డెబ్యూ అవార్డు గ్రహీతలకు వేదికపై మాట్లాడే అవకాశం కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. ఇది వారి జీవితకాల కల అని, స్వల్ప సమయం ఇచ్చినా వారి ప్రయాణానికి ప్రోత్సాహం లభిస్తుందని నిహారిక తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆమె అభిప్రాయం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఎప్పుడూ కూల్‌గా.. కామ్‌గా తన పనేదో.. తాను చేసుకుంటే పోయే నిహారిక ఇప్పుడు ఉన్నట్టుండి సీరియస్ పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ఏకంగా ఫిల్మ్ ఫేర్ నిర్వాహకుల తీరునే ఎండగట్టారు. తన పోస్టుతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.. ఈ మెగా డాటర్. ఇక అసలు విషయం ఏంటంటే..! ఇటీవల ఫిలిం ఫేర్ అవార్డుల ప్రధాన వేడుక జరిగింది. ఈ ఈవెంట్ లో అన్ని సినీ పరిశ్రమల నుంచి డెబ్యూటెంట్స్‌ గా చాలా నటీనటులు అవార్డులు అందుకున్నారు. కానీ, వాళ్ళకి ఆ స్టేజిపై మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు ఫిలిం ఫేర్ నిర్వాహకులు. తాజాగా ఈ విషయం పైనే నిహారికి సీరియస్ పోస్ట్ చేశారు. డెబ్యూ అవార్డు అనేది ప్రతీ ఆర్టిస్ట్ జీవితంలో చాలా ప్రత్యేకమైనది. అలాంటి సమయంలో వేదికపై నిలబడి రెండు మాటలు మాట్లాడటం అనేది వాళ్ళ జీవితకాల కల. కానీ, నిర్వాహకులు ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకపోవడం చాలా బాధాకరం అన్నారు నీహారిక. ఇలాంటి అవార్డు వేడుకల్లో సమయ పరిమితులు ఉంటాయని తనకు తెలుసని.. కానీ, మొదటిసారి అవార్డు అందుకున్న ఆర్టిస్టులకు.. స్టేజిపై ఒక్క ముక్కైనా మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుందేదంటూ ఆమె అభిప్రాయపడ్డారు. అది వాళ్ళ ప్రయాణానికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేదంటూ తన పోస్టులో నిహారిక కోట్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా వీధుల్లో మహాభారత ‘మయసభ’

రమ్యకృష్ణ కొడుకు ఫిల్మ్ ఎంట్రీ ?? తండ్రి ఏమన్నారంటే..

Top9 ET: అల్లు శిరీష్ పెళ్లి వేడుక.. మెగా బ్రదర్స్ కి స్పెషల్ పెళ్లి పిలుపు..

మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..

గ్రామ సర్పంచ్‌ ఇంటిముందు క్షుద్రపూజలు

Follow Us