AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రామ సర్పంచ్‌ ఇంటిముందు క్షుద్రపూజలు

గ్రామ సర్పంచ్‌ ఇంటిముందు క్షుద్రపూజలు

Phani CH
|

Updated on: Feb 24, 2026 | 7:36 PM

Share

జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంట తండాలో సర్పంచ్ భనోత్ మహేందర్ ఇంటి వద్ద అర్ధరాత్రి జరిగిన క్షుద్రపూజలు కలకలం రేపాయి. నిమ్మకాయలు, నల్ల నువ్వులు వంటి ఆనవాళ్లతో తండావాసులు భయభ్రాంతులకు గురయ్యారు. తన ఎదుగుదలను ఓర్వలేక ప్రత్యర్థులు రాజకీయ కక్షతో ఈ నీచ చర్యలకు పాల్పడుతున్నారని సర్పంచ్ ఆరోపించారు. ఈ ఘటన వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయా లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్న ఆందోళన నెలకొంది.

జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం గుడికుంట తండాలో అర్ధరాత్రి క్షుద్రపూజలు కలకలం రేపాయి. ప్రస్తుత గ్రామ సర్పంచ్ భనోత్ మహేందర్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించడం తండావాసులను భయాందోళనలకు గురిచేసింది. సోమవారం తెల్లవారుజామున సర్పంచ్ కుటుంబ సభ్యులు తలుపు తీసి ఇంటినుంచి బయటకు రాగా ఇంటి గుమ్మం వద్ద పసుపు, కుంకుమ, నల్ల నువ్వులు, నల్ల ఆవాలు, మంత్రించిన నిమ్మకాయలు కనిపించాయి. క్షుద్రపూజల ఆనవాళ్లను చూసి సర్పంచ్ మహేందర్ కుటుంబీకులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం తండా అంతా వ్యాపించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. తన ఎదుగుదలను ఓర్వలేకనే ప్రత్యర్థులు ఈ వికృత చేష్టలకు పాల్పడుతున్నారని సర్పంచ్ మహేందర్ ఆరోపించారు. తాను ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటి నుండి కొందరు రాజకీయ కక్షతో తనను ఇబ్బంది పెడుతున్నారని, ఇప్పుడు ఏకంగా ప్రాణహాని తలపెట్టేలా క్షుద్రపూజల పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అని ఆందోళనచెందుతున్నారు తండావాసులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్మశానంలో దెయ్యలతో కలసి మనుషులు మందు పార్టీ.. ట్రెండ్ అవుతున్న వీడియో

వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..

హోలికా దహనంలో ఈ కలపను వాడుతున్నారా.. జాగ్రత్త

ట్విన్స్‌ డే రోజు అరుదైన ఘటన.. కవల సోదరీమణులను వివాహం చేసుకున్న కవల సోదరులు

పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త

Follow Us