ట్విన్స్ డే రోజు అరుదైన ఘటన.. కవల సోదరీమణులను వివాహం చేసుకున్న కవల సోదరులు
కామారెడ్డి జిల్లాలో ఒక అరుదైన కవలల వివాహం జరిగింది. కవల సోదరులు విజయ్, వినయ్.. కవల సోదరీమణులు కీర్తన, కీర్తిని 'కవలల దినోత్సవం' రోజున ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకున్నారు. ఒకేలా ఉండే వధూవరులను చూసి బంధుమిత్రులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ అద్భుతమైన పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెళ్లి వేదికపై ఒకేలా ఉండే వధూవరుల జంటను చూస్తేనే బంధుమిత్రులు మురిసిపోతారు. మరి అచ్చం ఒకేలా ఉండే ఇద్దరు అన్నదమ్ములు, అచ్చం ఒకేలా ఉండే ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఒకే ముహూర్తానికి పెళ్లాడితే? ఆ అద్భుత దృశ్యానికి కామారెడ్డి జిల్లా వేదికైంది. అదికూడా కవలల దినోత్సవం’ రోజే ఈ వేడుక జరగడం విశేషం. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన దుంపటి విజయ్, వినయ్ ఇద్దరూ కవలలు. వీరి పోలికలు అచ్చం ఒకేలా ఉంటాయి. వీరి కోసం సంబంధాలు వెతుకుతున్న క్రమంలో.. తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తన, కీర్తి అనే కవల సోదరీమణుల గురించి తెలిసింది. రూపురేఖల్లోనే కాదు, మనస్తత్వాల్లోనూ ఈ రెండు జంటల మధ్య చక్కని అవగాహన కుదరడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఒకే ముహూర్తానికి విజయ్-కీర్తన, వినయ్-కీర్తిలు పెళ్లి పీటల మీద కూర్చున్న దృశ్యం పెళ్లికి వచ్చిన వారందరినీ మంత్రముగ్ధులను చేసింది. అచ్చం ఒకేలా ఉన్న ఇద్దరు వధువులు, ఇద్దరు వరులను చూసి బంధువులు, గ్రామస్తులు ఒకింత అయోమయం, ఆశ్చర్యానికి లోనయ్యారు. “ఇలాంటి అరుదైన వివాహాన్ని చూడటం చాలా సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు స్థానికులు. ఈ పెళ్లి సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త
ఇంట్లో తండ్రి మృతదేహం.. పరీక్ష హాల్లో తనయుడు పుట్టెడు దుఃఖంతో..
Jai Hanuman: లాంఛనంగా మొదలైన జై హనుమాన్ సినిమా
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌లో అవేం ఉండవు.. తేల్చేసిన హరీష్ శంకర్..!
నాయికలను రిపీట్ చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. కారణం అదేనా ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

