అమెరికా వీధుల్లో మహాభారత ‘మయసభ’
పెద్దపల్లి జిల్లా మంథని త్రీడీ కళాకారుడు సింగాపు శివరామకృష్ణ అమెరికా లేక్ వర్త్ బీచ్ ఫెస్టివల్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 850 మంది కళాకారులలో భారత్ నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి ఈయన. మహాభారతంలోని మయసభను 3D రూపంలో చిత్రీకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రాచీన భారతంలోనే 3D కళ ఉందని చాటిచెప్పి, మన సంస్కృతి గొప్పదనాన్ని విదేశాల్లో చాటారు. మీడియా ప్రశంసలు అందుకున్నారు.
“ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అన్న గేయానికి నిలువెత్తు రూపంగా నిలిచారు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన త్రీడీ కళాకారుడు సింగాపు శివరామకృష్ణ. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ప్రతిష్టాత్మక ‘లేక్ వర్త్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్’లో తన అద్భుత కళాఖండంతో అమెరికన్లను మంత్రముగ్ధులను చేశారు. ఈ అంతర్జాతీయ చిత్రకళా ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 850 మంది కళాకారులు హాజరుకాగా, భారత్ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక కళాకారుడు శివరామకృష్ణ కావడం విశేషం. టాప్ 50 ఆర్టిస్టులలో ఒకరిగా ‘ఫీచర్డ్ ఆర్టిస్ట్’ హోదాలో ఆయన మహాభారతంలోని ‘మయసభ’ ఘట్టాన్ని ఎంచుకున్నారు. సభలోని మాయాకొలనును త్రీడీ రూపంలో వీధిపైనే సజీవంగా చిత్రీకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న త్రీడీ ఆర్ట్ మన మహాభారత కాలంలోనే ఉందన్న విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికే తాను ఈ చిత్రాన్ని గీశానని శివరామకృష్ణ తెలిపారు. ఈ కళాఖండాన్ని చూసి విస్తుపోయిన అక్కడి మీడియా “ది ఆర్టిస్ట్ ఫ్రమ్ భారత్.. ది ఆర్ట్ ఫ్రమ్ మహాభారత్” అంటూ ప్రశంసల జల్లు కురిపించింది. మన దేశ సాంస్కృతిక గొప్పదనాన్ని విదేశీ గడ్డపై చాటిన శివరామకృష్ణను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రమ్యకృష్ణ కొడుకు ఫిల్మ్ ఎంట్రీ ?? తండ్రి ఏమన్నారంటే..
Top9 ET: అల్లు శిరీష్ పెళ్లి వేడుక.. మెగా బ్రదర్స్ కి స్పెషల్ పెళ్లి పిలుపు..
మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..
గ్రామ సర్పంచ్ ఇంటిముందు క్షుద్రపూజలు
స్మశానంలో దెయ్యలతో కలసి మనుషులు మందు పార్టీ.. ట్రెండ్ అవుతున్న వీడియో
మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..
గ్రామ సర్పంచ్ ఇంటిముందు క్షుద్రపూజలు
స్మశానంలో దెయ్యలతో కలసి మనుషులు మందు పార్టీ..
వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..
హోలికా దహనంలో ఈ కలపను వాడుతున్నారా.. జాగ్రత్త
ట్విన్స్ డే రోజు అరుదైన ఘటన..
పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త

