AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasekhar: 'నోరు విప్పి అడిగినా.. నాకు ఆ రోల్‌ ఇవ్వలేదు'

Rajasekhar: ‘నోరు విప్పి అడిగినా.. నాకు ఆ రోల్‌ ఇవ్వలేదు’

Phani CH
|

Updated on: Feb 24, 2026 | 8:15 PM

Share

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు పంచుకున్నారు. రామ్ చరణ్ 'ధ్రువ' సినిమాలో విలన్ పాత్ర (సిద్ధార్థ్ అభిమన్యు) తాను చేయాల్సిందిగా వెల్లడించారు. తెలివైన విలన్ పాత్రలు చేయాలని ఉందని, ఆ పాత్ర తనకు బాగా నచ్చిందని చెప్పారు. అయితే, ఖర్చు ఎక్కువవుతుందనే కారణంతో తనకు ఆ రోల్ ఇవ్వలేదని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్! పవర్ ఫుల్ హీరోగా మాత్రమే కాదు.. ఫ్యామిలీ స్టార్‌గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే హీరోగా సక్సెస్‌లు లేకపోవడంతో… విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రూటు మార్చాలనుకున్నారు రాజశేఖర్. ఈ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్డినరీ మూవీలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న బైకర్ లోనూ ఓ కీ రోల్ చేస్తున్నారు.ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన రాజశేఖర్.. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధ్రువ’ సినిమాలో విలన్‌గా తాను చేయాల్సిందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. తనకు విలన్ పాత్రలు చేయాలని ఉందని చెప్పిన రాజశేఖర్.. అయితే ఆ పాత్రలు రొటీన్‌గా కాకుండా.. డిఫరెంట్‌గా ఉండాలన్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ‘ధ్రువ’ సినిమాలో అరవింద స్వామి పోషించిన ‘సిద్ధార్థ్ అభిమన్యు’ క్యారెక్టర్‌ తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. విలన్ అంటే కేవలం అరిచేవాడు కాదని.. హీరోకి ధీటుగా తెలివైన వాడు ఉండాలన్నారు. అలాంటి పాత్రలు నటనలోని కొత్త కోణాన్ని చూపిస్తాయని.. అందకే అప్పట్లో ‘సిద్ధార్థ్ అభిమన్యు’ పాత్రను తాను చేయాలని అనుకున్నట్టు చెప్పుకొచ్చారు. అనుకోవడమే కాదని.. ఆ రోల్ తాను చేస్తానని అడిగిట్టు గుర్తు చేసుకున్నారు రాజశేఖర్. అయితే తాను నోరు విప్పి అడిగాన సరే.. తనకు ఆ రోల్‌ ఇవ్వలేదని రాజశేఖర్ అన్నారు. తనను పెట్టుకుంటే ఖర్చు ఎక్కువవుతుందని.. అరవిందస్వామి అయితే కొన్ని తమిళ సినిమాలోని షాట్స్ వాడుకోవచ్చని.. డైరెక్టర్‌ సరరేందర్ రెడ్డి అనుకుని ఉండొచ్చంటూ రాజ శేఖర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Niharika Konidela: ఫిలిం ఫేర్ నిర్వాహకులపై నిహారిక ఫైర్..

అమెరికా వీధుల్లో మహాభారత ‘మయసభ’

రమ్యకృష్ణ కొడుకు ఫిల్మ్ ఎంట్రీ ?? తండ్రి ఏమన్నారంటే..

Top9 ET: అల్లు శిరీష్ పెళ్లి వేడుక.. మెగా బ్రదర్స్ కి స్పెషల్ పెళ్లి పిలుపు..

మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..

Follow Us