AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: కస్టమర్లకు అలర్ట్‌.. మార్చి నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..

March Bank Holidays: ఫిబ్రవరి నెలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇది ఫిబ్రవరి చివరి వారం. మార్చి నెల వచ్చే నెల, మీరు ఈ నెలలో బ్యాంకును సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే మార్చిలో బ్యాంకు సెలవులను ముందుగానే తనిఖీ..

Bank Holidays: కస్టమర్లకు అలర్ట్‌.. మార్చి నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..
Bank Holiday
Subhash Goud
|

Updated on: Feb 25, 2026 | 7:56 AM

Share

March Bank Holidays: ఫిబ్రవరి నెలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇది ఫిబ్రవరి చివరి వారం. మార్చి నెల వచ్చే నెల, మీరు ఈ నెలలో బ్యాంకును సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే మార్చిలో బ్యాంకు సెలవులను ముందుగానే తనిఖీ చేయాలి. అయితే ప్రతినెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది ఆర్బీఐ. మరి వచ్చే నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.. ఈ నెలలో మొత్తం 18 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

PM Kisan: రైతులకు షాకింగ్‌ న్యూస్‌.. పీఎం కిసాన్‌ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!

మార్చిలో బ్యాంకులు ఎప్పుడు మూసివేయబడతాయి?

  1. మార్చి 1 – ఆదివారం సెలవు కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌ ఉంటాయి.
  2. మార్చి 2 – హోలికా దహన్ కారణంగా కాన్పూర్, లక్నోలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  3. మార్చి 3- హోలీ రెండో రోజు అలాగే బేలాపూర్, భోపాల్, డెహ్రాడూన్, గాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా, రాంచీ, విజయవాడలలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  4. మార్చి 4- అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, ఇంఫాల్, ఇటానగర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లాలోని బ్యాంకులు మూసి ఉంటాయి.
  5. మార్చి 8 – ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.
  6. మార్చి 13- చాప్చర్ కుట్ కారణంగా ఈ రోజుఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు.
  7. మార్చి 14న నెలలో రెండవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.
  8. మార్చి 15 – ఆదివారం సెలవు దినం. దీని కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
  9. మార్చి 17 – షబ్-ఎ-ఖాదర్ కారణంగా జమ్మూ అండ్‌ శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు.
  10. మార్చి 19- గుడి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సర దినం. బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్ము, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, శ్రీనగర్, విజయవాడలో బ్యాంకులు బంద్‌.
  11. మార్చి 20 -ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)/జుమాత్-ఉల్-విదా కారణంగా జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం, విజయవాడలలోని బ్యాంకులకు సెలవు.
  12. మార్చి 21 – రంజాన్-ఈద్ (ఈద్-ఉల్-ఫితర్) (షావల్-1)/ఖుతుబ్-ఎ-రంజాన్/సర్హుల్ కారణంగా కొచ్చి, సిమ్లా, తిరువనంతపురం, విజయవాడ మినహా అన్ని నగరాల్లో బ్యాంకులకు సెలవు.
  13. మార్చి 22 – ఆదివారం సెలవు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌
  14. మార్చి 26 -శ్రీరామ నవమి. ఈ కారణంగా అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, చండీగఢ్, డెహ్రాడూన్, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాంచీ, సిమ్లాలోని బ్యాంకులకు సెలవు.
  15. మార్చి 27 – శ్రీరామ నవమి (చైతి దాసైన్) సందర్భంగా భోపాల్, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, పాట్నా, విజయవాడలలోని బ్యాంకులకు సెలవు.
  16. మార్చి 28 – నెలలో నాల్గవ శనివారం. ఈ కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.
  17. మార్చి 29- ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు బంద్‌.
  18. మార్చి 31- మహావీర్ జన్మకల్యాణక్/మహావీర్ జయంతి కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీలలో బ్యాంకులు పూర్తిగా మూసి ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us