హైదరాబాద్లోని కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద జనవరి 31న జరిగిన కాల్పుల కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. దోపిడీ కోసమే కాల్పులకు తెగబడిన ఇద్దరు ప్రధాన నిందితులను ఇతర రాష్ట్రాల నుండి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో కలకలం రేపిన ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.