విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని కోట నరవలో ధనలక్ష్మి అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తన ఇంట్లోనే మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరిస్తూ, ఇది హత్య లేదా సహజ మరణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.