AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా సెమీస్ చేరాలంటే.. ఇక ఆయన రంగంలోకి దిగాల్సిందే..

Team Indias T20 World Cup 2026 Semi-Final Qualification Scenarios: దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్స్ కు టీమిండియా అర్హత సాధించడం సంక్లిష్టంగా మారింది. రన్ రేట్ మైనస్‌లో ఉండటం, వెస్టిండీస్ మెరుగైన విజయం సాధించడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్ ఫలితం, టీమిండియా తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలుపు లేదా వరుణుడి కరుణ వంటి అంశాలపై సెమీఫైనల్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.

Venkata Chari
|

Updated on: Feb 25, 2026 | 10:34 AM

Share
Team Indias T20 World Cup 2026 Semi-Final Qualification Scenarios: టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్స్ కు టీమిండియా అర్హత సాధించడంపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడం, టీమిండియా రన్ రేట్ మైనస్ లో ఉండటం దీనికి ప్రధాన కారణాలు. అలాగే, జింబాబ్వేపై వెస్టిండీస్ 100కు పైగా పరుగుల తేడాతో విజయం సాధించడంతో టీమిండియాపై ఒత్తిడి మరింత పెరిగింది. సెమీఫైనల్స్ కు చేరాలంటే భారత జట్టుకు కొన్ని మార్గాలున్నాయి.

1 / 5
ముఖ్యంగా, ఫిబ్రవరి 26వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరగనున్న మ్యాచ్ ఫలితం కీలకం. ఆ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిచి వెస్టిండీస్ ను ఓడించాలి.

2 / 5
ఇదే సమయంలో, టీమిండియా తన తదుపరి రెండు మ్యాచ్ లను జింబాబ్వే, వెస్టిండీస్ పై భారీ విజయాలతో ముగించాల్సి ఉంది. ఒకవేళ ఫిబ్రవరి 26న జరిగే మ్యాచ్ లో వెస్టిండీస్ విజయం సాధిస్తే, టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు దాదాపు అసాధ్యం అవుతాయి.

3 / 5
వర్షం కూడా టీమిండియాకు అనుకూలంగా మారవచ్చు. దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే, టీమిండియా తన తదుపరి రెండు మ్యాచ్లలో గెలిస్తే సెమీఫైనల్స్ కు సులభంగా చేరుకుంటుంది.

4 / 5
ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో, దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడటం టీమిండియా ఆశలను సజీవంగా ఉంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

5 / 5
Follow Us