దానిమ్మ పండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరూ భావిస్తారు. అయితే, తక్కువ రక్తపోటు (హైపోటెన్షన్) ఉన్నవారు దానిమ్మను ముట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానిమ్మ రక్తపోటును మరింత తగ్గించే గుణం కలిగి ఉండటంతో, హైపోటెన్షన్ బాధితులకు మైకం, బలహీనత వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి, దానిమ్మ తినే ముందు వైద్యులను సంప్రదించడం ముఖ్యం.