AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metro: ఇక 3 గంటలు కాదు.. కేవలం 58 నిమిషాల్లోనే.! మెట్రోలో విమానం లాంటి ప్రయాణం..

ఉత్తరప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. ఢిల్లీ నుంచి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు ప్రయాణించే లక్షలాది మందికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీరట్‌లో పర్యటించి, సుమారు రూ. 12,930 కోట్ల విలువైన.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Metro: ఇక 3 గంటలు కాదు.. కేవలం 58 నిమిషాల్లోనే.! మెట్రోలో విమానం లాంటి ప్రయాణం..
Representative Image
Ravi Kiran
|

Updated on: Feb 25, 2026 | 11:53 AM

Share

ప్రధాని మోదీ మీరట్‌లో రూ. 12,930 కోట్ల విలువైన నమో భారత్ కారిడార్, మీరట్ మెట్రో సేవలను ప్రారంభించారు. ఢిల్లీ నుంచి మీరట్ ప్రయాణ సమయం మూడు గంటల నుంచి 58 నిమిషాలకు తగ్గింది. ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోగా నిలవడమే కాకుండా, ఉత్తరప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. ఢిల్లీ నుంచి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు ప్రయాణించే లక్షలాది మందికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీరట్‌లో పర్యటించి, సుమారు రూ. 12,930 కోట్ల విలువైన భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా 82 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ, గజియాబాద్, మీరట్ నమో భారత్ కారిడార్‌ను జాతికి అంకితం చేశారు.

ఈ ప్రాజెక్టు ప్రారంభంతో దేశ రాజధాని నుంచి మీరట్ వరకు ప్రయాణం ఇప్పుడు విమాన వేగంతో సమానంగా సాగనుంది. ప్రధాని మోదీ మీరట్ మెట్రో సేవలను కూడా జెండా ఊపి ప్రారంభించారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మీరట్ మెట్రో దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో వ్యవస్థగా రికార్డు సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా ఒకే రైల్వే ట్రాక్‌పై రీజనల్ రైల్, లోకల్ మెట్రో నడిచేలా అత్యాధునిక సాంకేతికతను ఇక్కడ ఉపయోగించారు. గతంలో ఢిల్లీలోని సరాయి కాలేఖాన్ నుంచి మీరట్‌లోని మోదీపురం చేరుకోవడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేది. ఈ కొత్త కారిడార్ వల్ల ఆ సమయం కేవలం 58 నిమిషాలకు తగ్గింది. ఇది సామాన్యుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా రోడ్డుపై వాహనాల రద్దీని, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి కొత్త రెక్కలు అందిస్తుందని నిపుణులు అభివర్ణిస్తున్నారు.

Follow Us