ఒక్క సినిమాతోనే టాలీవుడ్ నుంచి మాయమైన కన్నడ భామ సప్తమి గౌడ
Rajeev
24 February 2026
కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది సప్తమి గౌడ.. కన్నడలో సప్తమి గౌడ ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ సినిమాతో విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ‘ కాంతార ‘ సినిమాలో ఛాన్స్ అందుకుంది.
రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత హిందీ సినిమాల్లోకి కూడా అడుగు పెట్టింది సప్తమి.
కాంతార సినిమా తర్వాత ఈ చిన్నది సైలెంట్ అయ్యింది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు టాలీవుడ్ సినిమాతో రాబోతుంది.
ఇప్పటికే విడుదలైన ఆమె లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ది వాక్సిన్ వార్’ సినిమా ద్వారా హిందీ చిత్రసీమకు పరిచయమైన సప్తమి ఇప్పుడు తెలుగులో మరిన్ని ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.