Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెల్లారితే పెళ్లి పెట్టుకుని పవన్‌ కల్యాణ్‌ సినిమాకు వెళ్లాడు.. యంగ్ డైరెక్టర్‌ సతీమణి ఆసక్తికర కామెంట్స్‌

తెలుగులో తీసింది కొన్ని సినిమాలే అయినా ట్యాలెంటెడ్‌ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీరామ్ ఆదిత్య. సుధీర్‌ బాబు హీరోగా వచ్చిన 'భలే మంచి రోజు' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడీ యంగ్‌ డైరెక్టర్‌. మొదటి సినిమాతోనే డైరెక్టర్‌గా ఫుల్‌ మార్కులు కొట్టేశాడు.

తెల్లారితే పెళ్లి పెట్టుకుని పవన్‌ కల్యాణ్‌ సినిమాకు వెళ్లాడు.. యంగ్ డైరెక్టర్‌ సతీమణి ఆసక్తికర కామెంట్స్‌
Sriram Aditya Family
Follow us
Basha Shek

|

Updated on: May 25, 2023 | 12:42 PM

తెలుగులో తీసింది కొన్ని సినిమాలే అయినా ట్యాలెంటెడ్‌ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీరామ్ ఆదిత్య. సుధీర్‌ బాబు హీరోగా వచ్చిన ‘భలే మంచి రోజు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడీ యంగ్‌ డైరెక్టర్‌. మొదటి సినిమాతోనే డైరెక్టర్‌గా ఫుల్‌ మార్కులు కొట్టేశాడు. ఆతర్వాత నారా రోహిత్‌, సుధీర్‌ బాబు, సందీప్‌ కిషన్‌, ఆది సాయి కుమార్‌లతో కలిసి శమంతకమణి అనే భారీ మల్టీస్టారర్‌ సినిమా తీశాడు. నాగార్జున, నానిలతో కలిసి ‘దేవదాస్‌’ వంటి హిట్‌ సినిమా తీసిన శ్రీరామ్‌, హీరో సినిమాతో అశోక్‌ గల్లాను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగేందుకు కృషి చేస్తోన్న అతను ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. కాగా సినిమా విషయాల్లో తప్పితే పెద్దగా బయట కనిపించడు శ్రీరామ్‌ ఆదిత్య. అతని ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ గురించి కూడా పెద్దగా తెలియదు. అయితే ఇటీవల తన సతీమణి ప్రియాంక గ్రేస్‌తో కలిసి ఓ టీవీ షోకు హాజరయ్యాడీ యంగ్ డైరెక్టర్. ఈ సందర్భంగా తమ వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాలను అందరితో పంచుకున్నారీ లవ్లీ కపుల్‌.

‘స్కూల్‌లో చదువుకునే రోజుల్లో ప్రియాంక నాకు జూనియర్‌. నేను తనకు తెలుసు కానీ, నాకు తను తెలీదు. అయితే ఇద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. అసలు మేమిద్దరం ప్రేమించుకుంటామని అనుకోలేదు. దీనికి తోడు మా ఇంట్లో ఇప్పటి వరకు ఎవరూ ప్రేమ వివాహం చేసుకోలేదు. దీంతో ఇంట్లో వాళ్లు అంగీకరించరు అని బయటకు వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇందుకు మా ఫ్రెండ్స్‌ చాలా సాయం చేశారు. కానీ చాలా భయపడ్డాం. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో చూపించినట్లు కార్లు మారి వేరే ప్రాంతానికి వెళ్లాం. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్లకు ఫోన్‌ చేసి విషయం చెప్పాను. వాళ్లు ఇంటికి వచ్చేయండన్నారు. మా బంధువులందరినీ పిలిచి మళ్లీ పెళ్లి చేశారు’ అని చెప్పుకొచ్చాడు శ్రీరామ్ ఆదిత్య. దీనికి రిప్లై ఇచ్చిన ప్రియాంక ‘ ఉదయం పెళ్లి పెళ్లి పెట్టుకుని.. తెల్లవారు జామున సర్దార్‌ గబ్బర్‌ సింగ్ సినిమాకు వెళ్లాడు. ఆయనకు పవన్‌ అంటే అభిమానం. అందుకే ఆయన సినిమా మిస్‌ అవ్వకూడదని వెళ్లాడు’ అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..