- Telugu News Photo Gallery Cricket photos Royal Challengers Banaglaore players who should be released after IPL 2023
IPL 2023: ఆర్సీబీలో ప్రక్షాళన.. వచ్చే సీజన్‌లో ఈ ఆటగాళ్లు ఇక కనిపించరు.. లిస్టులో ఎవరెవరున్నారంటే?
ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్ ఈసారి ఆర్‌సీబీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశారు. డుప్లెసిస్ 730 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 639 పరుగులు చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 400 పరుగులు చేయగా, సిరాజ్ 19 వికెట్లతో మెరిశాడు.
Updated on: May 24, 2023 | 10:20 PM

IPL 2023 లో RCB జట్టు మరోసారి విఫలమైంది. లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే టోర్నీ మొత్తం నలుగురు ఆటగాళ్లపై ఆధారపడే మ్యాచ్‌లు ఆడింది ఆర్సీబీ.

అంటే ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్ ఈసారి ఆర్‌సీబీకి అత్యుత్తమ ప్రదర్శన చేశారు. డుప్లెసిస్ 730 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 639 పరుగులు చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 400 పరుగులు చేయగా, సిరాజ్ 19 వికెట్లతో మెరిశాడు.

ఫాఫ్, కోహ్లి, మాక్స్‌వెల్ మినహా ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ ఎవరూ 150 పరుగులు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సిరాజ్ మినహా ఏ బౌలర్ కూడా 15 వికెట్లు తీయలేదు.

అంటే జట్టుగా రాణించడంలో RCB పూర్తిగా విఫలమైంది. అందుకే వచ్చే సీజన్‌లోపు RCB జట్టులో పలు మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్ తదితరులు వచ్చే సీజన్‌లో బెంగళూరు జట్టులో కనిపించరని తెలుస్తోంది.

వీరితో పాటు మరికొందరి ఆటగాళ్లను కూడా బెంగళూరు జట్టు వదులుకోవచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.





























