- Telugu News Photo Gallery Cricket photos MS Dhoni says he has 8 to 9 months to decide on retirement plans after IPL finishes
MS Dhoni: మిలియన్ డాలర్ల ప్రశ్నకు గుడ్‌న్యూస్ చెప్పిన చెన్నై సారథి.. ఎట్టకేలకు మౌనం వీడిన ధోని.. ఏమన్నాడంటే?
MS Dhoni on Retirement: టోర్నీ సందర్భంగా ధోనీని చాలాసార్లు ఈ ప్రశ్న అడిగారు. అయితే ఈ ప్రశ్నకు ప్రతిసారీ మౌనంగా సమాధానమిచ్చాడు. కానీ, ఫైనల్ చేరిన తర్వాత అభిమానుల సందేహాలను పటాపంచలు చేసేశాడు.
Updated on: May 24, 2023 | 6:53 PM

ఎంఎస్ ధోని నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్‌లో 10వ సారి ఫైనల్స్‌కు చేరింది. ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై 15 పరుగుల తేడాతో గుజరాత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

ఈ ఎడిషన్‌లో చివరిసారిగా ఆడి చెన్నై అభిమానులకు స్వదేశంలో విజయాన్ని అందించాడు. దీంతో CSK అహ్మదాబాద్‌లో ఫైనల్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే అంతకు ముందు కోట్లాది మంది అభిమానుల ప్రశ్నకు ధోనీ తొలిసారి సమాధానమిచ్చాడు.

ఈ ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని చెప్పుకుంటున్నారు. అలాగే లీగ్ ప్రారంభానికి ముందే ఈ చర్చ మొదలైంది. టోర్నీ సందర్భంగా ధోనీకి ఈ ప్రశ్న చాలాసార్లు ఎదురైంది. అయితే ఈ ప్రశ్నకు ధోని ప్రతిసారీ మౌనంగా సమాధానమిచ్చాడు.

ఇప్పుడు చెన్నైలో జరిగిన క్వాలిఫయర్ 1 గెలిచిన తర్వాత ధోనీ ఎట్టకేలకు ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో, 'చెన్నై అభిమానులు మిమ్మల్ని మళ్లీ ఇక్కడ చూడగలరా? అని ధోనిని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ధోనీ స్పందిస్తూ.. ‘చెన్నైలోని అభిమానులు నన్ను మళ్లీ చూస్తారో లేదో కూడా నాకు తెలియదు. కానీ, రిటైర్మెంట్ చేయాలనే నా నిర్ణయానికి 8 నుంచి 9 నెలల సమయం ఉంది. కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉంది. డిసెంబర్‌లో వేలం నిర్వహిస్తామని, ఆ తర్వాత ఆలోచిస్తానని తెలిపాడు.

ధోనీ మాట్లాడుతూ, నేను ఎప్పుడూ సీఎస్‌కే తరపునే ఆడతాను. ప్రస్తుతం నేను జనవరి నుంచి ఇంటికి దూరంగా ఉన్నాను. మార్చి నుంచి ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. కాబట్టి రిటైర్మెంట్ గురించి తర్వాత ఆలోచిస్తానంటూ చెప్పుకొచ్చాడు. జట్టు ప్రదర్శన గురించి ధోనీ మాట్లాడుతూ, ఇది 2 నెలల కష్టమని ప్రకటించాడు. అందరూ సహకరించారని తెలిపాడు.

నిజానికి ఐపీఎల్ 2023 ధోనీకి చివరి సీజన్ అని చెబుతున్నారు. దీనికి అతని ఫిట్‌నెస్ కూడా ప్రధాన కారణం. ధోనీ మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడడం ఎడిషన్ మొత్తం చూశాం. చెన్నై జట్టును బాధతోనే ఫైనల్‌కు చేర్చిన ధోని ఇప్పుడు 5వ టైటిల్ పై కన్నేశాడు.





























