- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: JioCinema viewership touches 2.5 Crore when MS Dhoni batting during CSK GT IPL 2023 Qualifier 1 Know Details
MS Dhoni: ధోనీతో అట్లుంటది మరి.. ‘జియో సినిమా’కు రికార్డ్ స్థాయిలో వ్యూస్.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
JioCinema IPL: ఐపీఎల్ 2023 సీజన్‌లో వ్యూస్ పరంగా జియో సినిమా రికార్డు సృష్టించింది. 2019 ICC ODI ప్రపంచ కప్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేసింది.
Updated on: May 25, 2023 | 2:40 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ కొత్త మైలురాయిని నెలకొల్పింది. జియోసినిమాలో ఈ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 2.5 కోట్ల మంది వీక్షించారు.

అంబటి రాయుడు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ 1 పరుగు చేసి ఔటయ్యాడు. కానీ, ధోనీ క్రీజులోకి బ్యాటింగ్ కు వచ్చేసరికి వ్యూస్ 2.5 కోట్లకు చేరడం విశేషం. ధోని ఔట్ కావడంతో అది 55 లక్షలకు తగ్గడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.

దీంతో ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో జియోసినిమా తన వ్యూయర్‌షిప్ రికార్డును 3వ సారి బద్దలు కొట్టింది. ఇది 2019 ICC ODI ప్రపంచ కప్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నెలకొల్పబడిన ప్రపంచ రికార్డును కూడా సమం చేసింది.

ఏప్రిల్ 17న బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా.. ఎంఎస్ ధోని ఆటను చూడటానికి 2.4 కోట్ల మంది ప్రేక్షకులు జియోసినిమాకు షిఫ్ట్ అయ్యారు.

అంతకుముందు ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని బ్యాటింగ్ ప్రదర్శనను 2.2 కోట్ల మంది వీక్షకులను సాధించి రికార్డు సృష్టించింది.

IPL 2023 మొదటి ఐదు వారాల్లో జియోసినిమా 1,300 కోట్లకు పైగా వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. జియోసినిమా ఫ్యాన్-సెంట్రిక్ ప్రెజెంటేషన్‌తో వీక్షకులను ఆకట్టుకుంటోంది. జియోసినిమా ఒక్కో మ్యాచ్‌కి ఒక్కో వీక్షకుడికి సగటు సమయం 60 నిమిషాలుగా ఉంది.

టాటా IPL 2023 మ్యాచ్‌లను చూడటానికి క్రికెట్ అభిమానులు జియోసినిమాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ రికార్డులు రుజువు చేస్తున్నాయి. జియోసినిమా ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను వీక్షిస్తూనే అనేక ఫ్యాన్-సెంట్రిక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది.




