- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Best IPL bowling returns for an uncapped player in league History, check for the full list
IPL Uncapped Bowlers: ఐపీఎల్‌లో 5 వికెట్లు తీసిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?
బుధవారం జరిగిన ఐపీఎల్ 16వ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై యువ ఆటగాడు ఆకాశ్ మధ్వల్ 5 పరుగులు మాత్రమే ఇచ్చుకుని 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఐపీఎల్ క్రికెట్‌లో 5 వికెట్లు తీసిన 4వ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అవతరించాడు.
Updated on: May 25, 2023 | 4:16 PM

విశేషమేమిటంటే.. ఇప్పటివరకు 5 వికెట్లు తీసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లలో ఆకాశ్ మధ్వల్‌ది అత్యుత్తుమ ప్రదర్శనగా అగ్రస్థానంలో ఉంది.

అయితే అసలు ఐపీఎల్ క్రికెట్‌లో 5 వికెట్లు తీసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ల లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

అంకిత్ రాజ్‌పుత్: ఐపీఎల్ క్రికెట్‌లో 5 వికెట్లు తీసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ల లిస్టులో అంకిత్ రాజ్‌పుత్ తొలి ఆటగాడు. 2018 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన అంకిత్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై ఈ ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో అంకిత్ 14 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

వరుణ్ చక్రవర్తి: అంకిత్ తర్వాత ఈ లిస్టులో వరుణ్ చక్రవర్తి చేరాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న వరుణ్ చక్రవర్తి 2020 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 హాల్ ప్రదర్శన చేశాడు. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో వరుణ్ 20 పరుగులు ఇచ్చుకుని 5 వికెట్లు తీసుకున్నాడు. తద్వారా 5 వికెట్లు తీసిని రెండో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు.

ఉమ్రాన్ మాలిక్: ఈ లిస్టులో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కూడా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో గతేడాది జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ 25 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా 5 వికెట్లు తీసిని మూడో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అవతరించాడు.

ఆకాశ్ మధ్వల్: ఇక తాజాగా ఈ లిస్టులోకి ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు ఆకాశ్ మధ్వల్ కూడా చేరాడు. నిన్నటి మ్యాచ్‌లో 5 పరుగులు ఇచ్చి, 5 వికెట్లు తీయడం ద్వారా ఆకాశ్ ఈ ఘనత సాధించాడు.





























