- Telugu News Photo Gallery Cricket photos Indian women's cricket team star player Smriti Mandhana is dating Bollywood singer Palak Muchhal check here photos an tattoo
Smriti Mandhana: బాలీవుడ్ సింగర్‌తో డేటింగ్ చేస్తోన్న నేషనల్ క్రష్.. హాట్ టాపిక్‌గా లేడీ గంగూలీ ఫొటోస్.. టాటూనే సాక్ష్యం?
Smriti Mandhana-Palaash Muchhal: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'నేషనల్ క్రష్'గా పేరుగాంచిన స్మృతి మంధాన.. ప్రేమలో పడ్డారా..? ప్రస్తుతం ఇదే టాపిక్ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. ప్రముఖ బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ సోదరుడితో స్మృతి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Updated on: May 25, 2023 | 3:49 PM

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'నేషనల్ క్రష్'గా పేరుగాంచిన స్మృతి మంధాన.. ప్రేమలో పడ్డారా..? ప్రస్తుతం ఇదే టాపిక్ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. ప్రముఖ బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ సోదరుడితో స్మృతి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా బాలీవుడ్ దర్శకుడు, స్వరకర్త, గాయకుడు పలాష్ ముచ్చల్‌తో కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో నెటిజన్లు ఈ ఫొటోలను తెగ వైరల్ చేస్తున్నారు.

ఈ ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుంచి స్మృతి, పలాష్ ముచ్చల్ ఒకరినొకరు డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. పలాష్ బాలీవుడ్ గాయకుడు పాలక్ ముచ్చల్ సోదరుడు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పలాష్ ముచ్చల్‌తో కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ 'పుట్టినరోజు శుభాకాంక్షలు మంచి మనసున్న వ్యక్తి. గొప్ప సంవత్సరం ముందుంది' అంటూ స్మృతి రాసుకొచ్చింది.

ఈ ఫొటోలలో స్మృతి నల్లటి దుస్తులలో కనిపిస్తుండగా, పలాష్ ముచ్చల్ నలుపు ప్యాంటు, తెల్లటి షర్ట్‌లో కనిపిస్తున్నాడు. స్మృతి పోస్ట్‌పై భారత మహిళా క్రికెట్ జట్టులోని ఇతర ఆటగాళ్లలో జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్ కూడా కామెంట్ చేశారు.

ఈ పోస్ట్ వైరల్ అయిన వెంటనే, అభిమానులు దీనిపై మిశ్రమ స్పందనలు అందిస్తున్నారు. చాలా మంది అభిమానులు కామెంట్స్ విభాగంలో వీరిద్దరిని ప్రేమ పక్షులుగా పేర్కొంటున్నారు. దీంతో పాటు వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రశ్నలు గుప్పిస్తు్న్నారు.

మీ ఇద్దరి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నా’ అని ఓ అభిమాని వ్యాఖ్యానించాడు. ఇది నా హృదయాన్ని బద్దలుకొట్టింది' అని ఒకరు రాసుకొచ్చారు. ఇలా పలు రకాలుగా తమ కామెంట్లను పంచుకున్నారు.

స్మృతి, పలాష్ ముచ్చల్ కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు కూడా, స్మృతి పుట్టినరోజు పార్టీలో పలాక్‌ల ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలలో పలాష్ స్మృతికి కేక్ తినిపిస్తూ కనిపించాడు. ఇది కాకుండా స్మృతి పలాష్ ముచ్చల్ సోదరి పాలక్ ముచ్చల్, ఆమె కుటుంబం మొత్తం అనేక సందర్భాలలో కనిపించింది.

పలాష్ 'డిష్కియాన్' చిత్రంతో సంగీత స్వరకర్తగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అమితాబ్ బచ్చన్ నటించిన 'భూత్‌నాథ్ రిటర్న్స్'లోని ప్రసిద్ధ పాట 'పార్టీ తో ముంకీ హై'ని కూడా ఆయన స్వరపరిచారు. ఇటీవలే పలాష్ 'అర్ధ' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
