Shiva Prajapati

Shiva Prajapati

Sub-Editor - TV9 Telugu

shiva.oruganti@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో 10 సంవత్సరాల అనుభవం. 2013లో ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో సబ్ ఎడిటర్‌గా జర్నలిస్ట్ కెరీర్ ప్రారంభం. ప్రస్తుతం టీవీ9 తెలుగు డిజిటల్‌లో సబ్ ఎడిటర్‌. అంతకుముందు.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డిజిటల్‌ నెట్‌వర్క్‌లో సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వహించడం జరిగింది.

Read More
Andhra Pradesh: విశాఖ పర్యటనలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. డిసెంబర్‌లోగా..

Andhra Pradesh: విశాఖ పర్యటనలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. డిసెంబర్‌లోగా..

విశాఖ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. డిసెంబర్‌లోగా విశాఖకు షిఫ్ట్‌ అవుతానన్నారు. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామన్నారు. పరిపాలనా విభాగం అంతా ఇక్కడికే మారుతుందన్నారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారిందన్న ముఖ్యమంత్రి.. ఐటీ హబ్‌గా కూడా మారబోతుందన్నారు. విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం జగన్‌ ఈ కామెంట్స్‌ చేశారు.

Andhra Pradesh: ఏడాది ఎదురు చూపులు.. ఎట్టకేలకు చిక్కిన వేళ ఎగిరి గంతేసిన జాలరి..

Andhra Pradesh: ఏడాది ఎదురు చూపులు.. ఎట్టకేలకు చిక్కిన వేళ ఎగిరి గంతేసిన జాలరి..

వారి జీవినాధారం చేపల వేట. ప్రతి రోజూ ఉదయం వెళ్లడం.. చేపలు పట్టి విక్రయించడం. అలా వచ్చిన డబ్బుతో జీవనాన్ని సాగించడం జరుగుతుంది. అయితే, ఏ రోజైనా లక్కు తగలకపోతుందా? మాంచి పులస చిక్కకపోతుందా? ఆదాయం పెరగకపోతుందా? అని ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడి జాలర్లు. తాజాగా వారి ఎదురు చూపులకు ఫలితం దక్కింది. ఎట్టకేలకు జారల్ల వలకు పులస చిక్కింది. దాదాపు ఏడాది పాటు చిక్కని పులస..

Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల సెగలు.. మోసం చేశారంటూ శాపనార్థాలు..

Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల సెగలు.. మోసం చేశారంటూ శాపనార్థాలు..

Telangana Elections 2023: తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ కొందరికి షాక్‌ ఇస్తే.. మరికొందరిలో జోష్‌ నింపింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన 12 మంది అభ్యర్థులకు చోటు దక్కింది. కానీ.. నాగం జనార్థన్ సహా ఆయన లాంటి కొందరు మాజీ మంత్రులు, పార్టీలో సీనియర్ నాయకులకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఫలితంగా అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీకీ పలు నియోజకవర్గాల్లో నిరసన ఎదురైంది.

CM YS Jagan: విశాఖకు సీఎం జగన్.. ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే..

CM YS Jagan: విశాఖకు సీఎం జగన్.. ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే..

విశాఖ నుంచి త్వరలోనే పాలన కొనసాగిస్తానని చెప్పిన ఏపీ సీఎం జగన్‌ ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇవాళ విశాఖ, అనకాపల్లిలో జిల్లాలో పర్యటించనున్నారు. విశాఖలో ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, లారస్ ల్యాబ్స్‌లో నిర్మించిన అదనపు భవనాలను, యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్, ఎల్ఎస్‌పీఎల్ యూనిట్ 2ను జగన్ ప్రారంభిస్తారు.

Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా వేళ 600 ప్రత్యేక రైళ్లు.. ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే..

Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా వేళ 600 ప్రత్యేక రైళ్లు.. ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే..

South Central Railways: అసలే పండుగ సీజన్.. పైగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. వెరసి ప్రజంతా పట్టణం నుంచి తమ తమ ఊళ్లకు పయనం అవుతున్నారు. అయితే, పండుగ వేళ వాహనాలన్నీ ఫుల్ బిజీగా ఉంటాయి. ఈ దసరా పండుగలో ఇంటికి వెళ్లాలని లేదా ట్రిప్‌కు వెళ్లాలని అనుకున్న వారికి సాధారణ రైళ్లలో సీట్లు దొరకడం కష్టం. ఇలాంటి సమయంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది.

Telangana Elections: 105 సీట్లే లక్ష్యంగా గులాబీ బాస్ అడుగులు.. జనగాం, భువనగిరిలో కేసీఆర్ సభలు..

Telangana Elections: 105 సీట్లే లక్ష్యంగా గులాబీ బాస్ అడుగులు.. జనగాం, భువనగిరిలో కేసీఆర్ సభలు..

 తెలంగాణలో మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ అడుగులేస్తోంది. ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకెళుతోంది. అభ్యర్థలు ప్రకటన, మేనిఫెస్టో రూపకల్పన, బీఫారమ్స్‌ అంతజేత వరకు అంతా పకడ్బంధీ ప్రణాళిక.. ఈసారి వంద సీట్లే లక్ష్యంగా పెట్టుకుంది బీఆర్‌ఎస్‌. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్వయంగా అధేనేత కేసీఆర్‌ రంగంలోకి దిగారు.

Telangana Eelctions: కాంగ్రెస్ తొలి జాబితాపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్షన్.. ఏమన్నారంటే..

Telangana Eelctions: కాంగ్రెస్ తొలి జాబితాపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్షన్.. ఏమన్నారంటే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టికెట్‌ రాలేదని ఎవరూ బాధపడొద్దని నిజాయితీగా కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్కరికా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పదవులు ఉంటాయని వాటిలో టికెట్ రానివారిని సర్దుబాటు చేస్తామన్నారు.

CM KCR: చిలిపి పనులు వద్దు.. అడ్డంగా బుక్ చేస్తారు.. పార్టీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు

CM KCR: చిలిపి పనులు వద్దు.. అడ్డంగా బుక్ చేస్తారు.. పార్టీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు

BRS Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అధినేత స్పీడ్ పెంచారు. తమ పార్టీ అభ్యర్థులకు బీఫామ్ అందజేశారు. ఆదివారం నాడు(అక్టోబర్ 15) తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చారు గులాబీ బాస్. ఈ బీఫామ్స్ ఇచ్చే సమయంలో అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు కేసీఆర్. బీఫామ్స్ నింపే విషయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయంపై దిశానిర్దేశం చేశారు.

Telangana: తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న క్యాష్‌, గోల్డ్‌.. లెక్క చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Telangana: తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న క్యాష్‌, గోల్డ్‌.. లెక్క చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Telangana News: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో లెక్కా పత్రం లేకుండా తీసుకెళ్తున్న కోట్ల రూపాయల నగదు దొరుకుతున్నాయి. కేజీల కొద్ది బంగారం, వెండి కూడా పోలీసుల చేతికి చిక్కుతున్నాయి.తెలంగాణలో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు.

Telangana Elections: ఎన్నికల సమరానికి సిద్ధమైన గులాబీ దళపతి.. ఇదిగో ప్రచార రథం..

Telangana Elections: ఎన్నికల సమరానికి సిద్ధమైన గులాబీ దళపతి.. ఇదిగో ప్రచార రథం..

తెలంగాణలో ఎన్నికల సమరం షురూ అయ్యింది. ఈ కథనరంగంలో అడుగు ముందే ఉన్న గులాబీ దళపతి కేసీఆర్.. నేడు ప్రచార పర్వం ప్రారంభించనున్నారు. తాను సెంటిమెంట్‌గా భావిస్తున్న హుస్నాబాద్ నుంచే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. దాదాపు 3 వారాల పాటు అనారోగ్యంతో బాధపడిన సీఎం కేసీఆర్.. ఇవాళ్టి నుంచి జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు.

Andhra Pradesh: 6 నెలలుగా అమావాస్య రోజున క్షుద్ర పూజలు.. కట్ చేస్తే..

Andhra Pradesh: 6 నెలలుగా అమావాస్య రోజున క్షుద్ర పూజలు.. కట్ చేస్తే..

ప్రపంచ అంతా టెక్నాలజీ వైపు పరుగులు తీస్తుంది.. కొందరు జనాలు మాత్రం ఇంకా మూఢ నమ్మకాల్లోనే జీవిస్తున్నారు. వాటిని విశ్వసిస్తూ.. ఇతరులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా తిరుపతి రూరల్ మండలం ముళ్లపూడిలో క్షుద్ర పూజల కలకలం రేపింది. ఈ వ్యవహారంపై డయల్ 100కు సమాచారం ఇచ్చారు స్థానికులు. దాంతో వ్యవహారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముళ్లపూడి గ్రామ శివారులో..

Telangana Elections: కేసీఆర్‌ సెంటిమెంట్‌ వర్కౌవుట్‌ అవుతుందా? మంత్రి కేటీఆర్ చెప్పిన ఇంట్రస్టింగ్ లాజిక్..

Telangana Elections: కేసీఆర్‌ సెంటిమెంట్‌ వర్కౌవుట్‌ అవుతుందా? మంత్రి కేటీఆర్ చెప్పిన ఇంట్రస్టింగ్ లాజిక్..

గులాబీ బాస్‌..తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసే ప్రతి పనిలో 6 నంబర్‌కు ప్రాధాన్యం ఉండేటట్లుగా వ్యవహరిస్తారట. ప్రయాణించే వాహనం సహా, కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్‌ సమావేశం, ఇతర అన్నీ పనుల్లో ఆరు సంఖ్య ఉండేలా చూస్తారంట కేసీఆర్‌. ముఖ్యమంత్రి వ్యవహారాలను దగ్గరి నుంచి విశ్లేషించిన వ్యక్తులు చెప్తున్న మాటలు ఇవి. ఇక ఇవాళ అంటే 15వ తేదీన..