Telangana Elections: 105 సీట్లే లక్ష్యంగా గులాబీ బాస్ అడుగులు.. జనగాం, భువనగిరిలో కేసీఆర్ సభలు..
తెలంగాణలో మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ అడుగులేస్తోంది. ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకెళుతోంది. అభ్యర్థలు ప్రకటన, మేనిఫెస్టో రూపకల్పన, బీఫారమ్స్ అంతజేత వరకు అంతా పకడ్బంధీ ప్రణాళిక.. ఈసారి వంద సీట్లే లక్ష్యంగా పెట్టుకుంది బీఆర్‌ఎస్. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్వయంగా అధేనేత కేసీఆర్ రంగంలోకి దిగారు.
హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణలో మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ అడుగులేస్తోంది. ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకెళుతోంది. అభ్యర్థలు ప్రకటన, మేనిఫెస్టో రూపకల్పన, బీఫారమ్స్ అంతజేత వరకు అంతా పకడ్బంధీ ప్రణాళిక.. ఈసారి వంద సీట్లే లక్ష్యంగా పెట్టుకుంది బీఆర్‌ఎస్. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్వయంగా అధేనేత కేసీఆర్ రంగంలోకి దిగారు. తనకు సెంటిమెంట్‌గా మారిన హుస్నాబాద్ నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు సీఎం కేసీఆర్. మరోసారి ఆశీర్వదించాలంటూ హుస్నాబాద్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
018లో హుస్నాబాద్ నుంచే కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అద్భుత విజయం సాధించారు. అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలంటూ తాజాగా హుస్నాబాద్ నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు గులాబీ దళపతి. గులాబీ గర్జనతో హుస్నాబాద్ హుషారెత్తిపోయింది. తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లామన్నారు సీఎం కేసీఆర్. 95 నుంచి 105 సీట్లు BRS గెలిచేందుకు హుస్నాబాద్ వేదిక కావాలన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణను నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లామని, పారిశ్రామిక విధానంలో మనకు పోటీ, సాటి మరెవరూ లేరన్నారు కేసీఆర్. పెన్షన్ రూ.5000లకు పెంచబోతున్నామని, రైతుబంధును దశలవారీగా రూ.16,000లకు పెంచబోతున్నామన్నారు. హుస్నాబాద్ ఆశీర్వాదంతో 2018లో 88 సీట్లతో ఘనవిజయం సాధించామన్నారు సీఎం కేసీఆర్. .. ఇక ఇవాళ జనగామ, భువనగిరి సభల్లో ప్రసంగించనున్నారు సీఎం కేసీఆర్. ముఖ్యంగా జనగామ పాలిటిక్స్ కొంతకాలంగా రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కాదని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అక్కడ టికెట్ ఖరారు చేశారు. అంతేకాకుండా సుమారు 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన పొన్నాల..కొన్ని అనూహ్య పరిణామాల వల్ల ఆ పార్టీని వీడారు. పార్టీ తనను అవమానించిందంటూ.. కనీసం టికెట్ కూడా ఇస్తారన్న గ్యారంటీ లేదంటూ హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆ వెంటనే అలెర్టయిన గులాబీ పార్టీ..పొన్నాలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్..పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
పొన్నాల రాజీనామా ఎపిసోడ్ అందర్నీ ఆలోచనలో పడేసేలా చేసింది. అందునా ముందే నిర్ణయించిన ప్రకారం ఇవాళ జనగామలో సీఎం కేసీఆర్ బహిరంగసభలో పొన్నాల గులాబీ కండువా కప్పుకోబోతున్నారనే టాక్ ఉంది. అదే జరిగితే వేదికపై నుంచే సీఎం కేసీఆర్ పొన్నాలకు ఏమని హామీ ఇస్తారనేది ఆసక్తి రేపుతోంది.
ఇక జనగామ నుంచి నేరుగా భువనగిరికి రానున్నారు సీఎం కేసీఆర్. అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి విశేశాలేంటో మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. ఈ రెండు సభల విషయం పక్కనబెడితే.. బీఆర్ఎస్‌కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ టాపిక్ ఇది. నిన్న మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత కేటీఆర్ టీవీ 9 ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. అందులో చాలా ఆసక్తికరమైన అంశాలపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్‌తో చర్చించారు. ముఖ్యంగా కేసీఆర్ 2 చోట్ల నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు.. అసలు కేటీఆర్ సీఎం అయ్యేదెప్పుడు..? ఇలాంటి సూటి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఒక్కసారిగా వాటిని చూద్దాం.