CM KCR AI Photos: దుమ్ము రేపుతున్న కేసీఆర్.. సోషల్ మీడియా నిండా అవే ట్రేండింగ్ లో..

CM KCR AI Photos: దుమ్ము రేపుతున్న కేసీఆర్.. సోషల్ మీడియా నిండా అవే ట్రేండింగ్ లో..

Anil kumar poka

|

Updated on: Oct 16, 2023 | 9:04 AM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చేసింది. నవంబర్‌ 30న ఎన్నికల జరిపి, డిసెంబర్‌ 3న ఫలితాలు ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారం రంగంలోకి దిగేశాయి. ముఖ్యంగా అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ బీఆర్‌ఎస్.. ప్రచారంలోనే అదే ఊపుతో దూసుకెళుతోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఆ పార్టీ క్యాంపెయినింగ్‌ ఓ రేంజ్‌లో సాగుతోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చేసింది. నవంబర్‌ 30న ఎన్నికల జరిపి, డిసెంబర్‌ 3న ఫలితాలు ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారం రంగంలోకి దిగేశాయి. ముఖ్యంగా అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ బీఆర్‌ఎస్.. ప్రచారంలోనే అదే ఊపుతో దూసుకెళుతోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఆ పార్టీ క్యాంపెయినింగ్‌ ఓ రేంజ్‌లో సాగుతోంది. దిగ్గజ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌లో కేసీఆర్‌ అభిమానులు కొత్త కొత్త ఫోటోలు క్రియేట్‌ చేసి పోస్ట్ చేస్తున్నారు. స్టైలిష్ కళ్లజోడు, సిక్స్ ప్యాక్ కెసిఆర్ పిక్స్‌ అదరగొడుతున్నాయి. రజినీకాంత్ స్టైల్ లో అంబాసిడర్ కార్ బ్యాక్ గ్రౌండ్ లో మరో ఫోటో… కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ గ్రౌండ్లో ఇంకో ఫోటో, రోబో 3 లోడింగ్, కెసిఆర్ 3.0, కెసిఆర్ కిట్ అందజేస్తూ… మత్స్యకారుల నుంచి చేపలు అందుకుంటూ ఇలా రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

కొంతమంది మాత్రం కెసిఆర్ ఎన్నికల ప్రచారం కోసం ఫోటో షూట్ చేశారా అని భావిస్తున్నారు. అయితే ఈ ఫోటోలు ఫోటోషూట్ చేసినవి కాదని.. అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహిమ అని తెలిసి కేసీఆర్‌ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పనిలో పనిగా ఎలక్షన్ ప్రచారంతో పాటు, ప్రతిపక్షాలకు కౌంటర్లు కూడా ఈ ఫోటోలతోనే ఇస్తున్నారు. టిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం నుంచి ఈ ఫోటోలన్నీ రిలీజ్ అవుతున్నాయి. అంతేకాదు ఫేస్‌బుక్‌, ట్విట్టర్ ఎక్కడ చూసినా కెసిఆర్ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫోటోలే కనిపిస్తున్నాయి. చాలా కొత్తగా టక్ వేసుకొని, షూస్ తొడుక్కొని, సినిమా హీరో లా కనిపించేలా ఈ ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు. కేవలం కేసీఆర్ ఫోటోలు మాత్రమే కాదు పథకాలను కూడా ప్రతిభంబించేలా ఈ ఏఐ ఫోటోలను తయారు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా ఎలాంటి డిజిటల్ ప్రచారాలు ఊపందుకుంటాయోననే చర్చ ఆసక్తిగా సాగుతోంది. ఒక ఫోటోలో కాళేశ్వరం, కాళేశ్వరండ్యాం పైన కెసిఆర్ అని రాసి ఉన్న చిత్రం ఆ పక్కనే రాహుల్ గాంధీ ఆ మొత్తం డ్యామ్ ను ఆసక్తిగా తిలకిస్తున్న దృశ్యాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..