Israel attacks: నీళ్లు లేవు..కరెంట్ లేదు.. గాజాలో ప్రత్యక్ష నరకం.! వీడియో

Israel attacks: నీళ్లు లేవు..కరెంట్ లేదు.. గాజాలో ప్రత్యక్ష నరకం.! వీడియో

Anil kumar poka

|

Updated on: Oct 16, 2023 | 9:36 AM

ఇజ్రాయెల్‌-హమాస్‌ మిలిటెంట్ల దాడి కొనసాగుతోంది. ఈ క్రమంలో హమాస్‌ కమాండర్‌ యావత్‌ ప్రంచం మా చట్టం కింద పనిచేయాల్సిందే నంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనికి ఇజ్రాయెల్‌ ప్రధాని ఘాటుగా రిప్లై ఇచ్చారు. హమాస్‌ను కూకటివేళ్లతో పెకలించివేస్తామన్నారు. హమాస్‌ మిలిటెంట్లను తుదముట్టించడమే ధ్యేయంగా వారి పాలనలో ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం చుట్టముట్టింది.

ఇజ్రాయెల్‌-హమాస్‌ మిలిటెంట్ల దాడి కొనసాగుతోంది. ఈ క్రమంలో హమాస్‌ కమాండర్‌ యావత్‌ ప్రంచం మా చట్టం కింద పనిచేయాల్సిందే నంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనికి ఇజ్రాయెల్‌ ప్రధాని ఘాటుగా రిప్లై ఇచ్చారు. హమాస్‌ను కూకటివేళ్లతో పెకలించివేస్తామన్నారు. హమాస్‌ మిలిటెంట్లను తుదముట్టించడమే ధ్యేయంగా వారి పాలనలో ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం చుట్టముట్టింది. ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్‌ గాజాకు ఆహారం, ఇంధనం విద్యుత్‌ సరఫరా నిలిపివేసింది. గాజాలో ఒక కాలనీ వెంట మరో కాలనీలో ఇజ్రాయెల్‌ వైమానిక దళం బాంబు దాడులు చేసుకుంటూ భవనాలను నేలమట్టం చేస్తూ వెళ్తోంది. నేలకూలుతున్న భవనాలు, ఎగిసిపడుతున్న దుమ్ము ధూళీ, పొగ.. గాజా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి హృదయవిదారకంగా మారింది. 24 గంటల్లో 450 లక్ష్యాలపై బాంబు దాడులు జరిగాయి. గాజా పోర్టులోని ఫిషింగ్‌ బోట్లపై బాంబు పడటంతో అవన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దాడులతో బెంబేలెత్తుతున్న గాజా వాసులు పాఠశాలల్లో ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న షెల్టర్లకు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం జనరేటర్లపై నడుస్తున్న కార్యాలయాలు, ఆసుపత్రులు ఇంధనం కోసం అల్లాడుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ఒకే ఒక్క విద్యుత్తు ప్లాంటులో ఇంధనం నిండుకుని గాజా అంతా అంధకారం నెలకొనే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే 7 ఆసుపత్రుల్లో మందులు నిండుకున్నాయని ఐక్యరాజ్యసమితి సేవా సంస్థ వెల్లడించింది. అల్‌-కరామా ప్రాంతమంతా బాంబు దాడులతో విధ్వంసమైంది. అనేకమంది చనిపోయారు. వందలాదిమంది గాయపడ్డారు. వైద్య బృందం అక్కడికి వెళ్లడానికి అవకాశం లేదు. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి అని హమాస్‌ హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. 2,50,000 మంది ఇళ్లను వదిలి వెళ్ళిపోయారు. 4,00,000 మందికి నీరు, శానిటేషన్‌ సౌకర్యాలు నిలిచిపోయాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..