Hyderabad: హైదరాబాదీ పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ.. స్మార్ట్ ఫోన్‌తో క్యాన్సర్ గుర్తింపు..!
హైదరాబాద్, అక్టోబర్ 13: హైదరాబాదీ పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ చేశారు. నోటి క్యాన్సర్లను గుర్తించే స్మార్ట్ ఫోన్‌ను రూపొందించారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఐ-హబ్, ఐఎన్ఏఐ ప్రతినిథులు సంయుక్తంగా ఈ పరికరాన్ని కనుగొన్నారు. జస్ట్ స్మార్ట్‌ఫోన్‌తో నోటి కుహరం వద్ద ఫోటోలు తీస్తేచాలు.. ఫోన్‌లో అమర్చని ఏఐ సాఫ్ట్‌వేర్ క్యాన్సర్‌ను పసిగడుతుంది. క్యాన్సర్ ఉందా? లేదా? అని గుర్తించి నిమిషాల్లోనే చెప్పేస్తుంది.
హైదరాబాద్, అక్టోబర్ 13: హైదరాబాదీ పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ చేశారు. నోటి క్యాన్సర్లను గుర్తించే స్మార్ట్ ఫోన్‌ను రూపొందించారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఐ-హబ్, ఐఎన్ఏఐ ప్రతినిథులు సంయుక్తంగా ఈ పరికరాన్ని కనుగొన్నారు. జస్ట్ స్మార్ట్‌ఫోన్‌తో నోటి కుహరం వద్ద ఫోటోలు తీస్తేచాలు.. ఫోన్‌లో అమర్చని ఏఐ సాఫ్ట్‌వేర్ క్యాన్సర్‌ను పసిగడుతుంది. క్యాన్సర్ ఉందా? లేదా? అని గుర్తించి నిమిషాల్లోనే చెప్పేస్తుంది. అంతేకాదు. ఈ క్యాన్సర్ మొదటి దశలో ఉందా? తీవ్రంగా మారిందా? అనేది కూడా విశ్లేషించి డేటాను వెల్లడిస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు నోటి క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నోటి క్యాన్సర్‌పై అవగాహన లేక.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఈ డివైజ్.. అద్భుతంగా సహాయ పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా నోటి క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి, అవసరమైన చికిత్స తీసుకునే దోహదపడుతుందన్నారు.
నోటి క్యాన్సర్‌ను గుర్తించేందుకు బయాప్సీ అవసరం లేకుండానే నోటి కుహరంలో గాయాలు, చిన్న చిన్న కణితుల్లో రక్త స్రావం వంటి వాటిని స్మార్ట్‌ఫోన్ ద్వారా ఫోటో తీస్తే.. అందులో ఏఐ టెక్నాలజీ డేటాను విశ్లేషిస్తుంది. క్యాన్సర్ ఉందా? లేదా? ఉంటే ఏ దశలో ఉంది. అనే వివరాలను క్లియర్‌గా తెలుపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కాగా, ఈ పరికరం రూపకల్పనలో పరిశోధకులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. దీని తయారీకి అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్ తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకు అందనుంది. అందిన వెంటనే.. వైద్యులకు పంపిణీ చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.
ఇదెలా పని చేస్తుంది..
ఈ నూతన ఆవిష్కరణ రూపకల్పన అంత ఈజీగా ఏమీ జరుగలేదు. పరిశోధకుల విశేష కృషి, భారీ ఎత్తున డేటా సేకరణ, విశ్లేషణల ద్వారా ఇది సాధ్యమైంది. వాస్తవానికి నోటి క్యాన్సర్ గుర్తించేందుకు బయోస్పీ చేయాల్సి ఉంటుంది. బయోస్పీ ద్వారా నోటి కుహరంలోని పండ్లు, కణితులను పరిశీలిస్తారు. దీన్ని బేస్ చేసుకుని.. సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు పరిశోధకులు. క్యాన్సర్ లక్షణాలను ఫోటో ద్వారా గుర్తించే అంశంపై ప్రయోగం చేయాలని తలించారు. బయోకాన్ ఫౌండేషన్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రతినిధులు కమ్యూనిటీ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌పై పరిశోధనలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారి, లేని వారి నోటి కుహర ఫోటోలను సేకరించారు. బయాస్పీ చేస్తే క్యాన్సర్ కచ్చితంగా ఉందని చెప్పే లక్షణాలు ఉన్న ఫోటోలను తీశారు. ఆ తరువాత ప్రముఖ వైద్య నిపుణులు ప్రజ్ఞాసింగ్, వివేక్ తల్వార్ ల సూచనలు, సలహాలతో తాము సేకరించిన ఫోటోల్లో మార్పులు, చేర్పులు చేసి పెద్ద డేటాబేస్‌ను తయారు చేశారు. దాదాపు 2 వేలకు పైగా ఫోటోలను నిక్షిప్తం చేసి.. ఏఐ టెక్నాలజీకి అనుసంధానం చేశారు పరిశోధకులు. దీని ఆధారంగా.. కొత్తగా నోటి కుహరంలో తీసిన ఫోటోలను అనుసంధానిస్తే వాటిని విశ్లేషించి క్యాన్సర్‌ను నిర్ధారిస్తుంది ఈ సాఫ్ట్‌వేర్. అంతేకాదు..క్యాన్సర్ ఏ దశలో ఉందో నిర్ధారించి గ్రేడింగ్‌లను కూడా ఇస్తుంది.
మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..