Bengaluru: బాత్రూమ్ సైజు లేదు.. రెంట్ మాత్రం రూ. 12 వేలు.. ఎక్కడో తెలుసా?

Peak Bengaluru: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ఈ పాట గుర్తుందా? ఒకవేళ మర్చిపోయినా.. నేటి పరిస్థితులు వెంటనే గుర్తు చేస్తాయిలేండి. అవును మరి.. నేడు చాలా మంది పరిస్థితి ఇలానే ఉంది. ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. కొత్తగా ఎక్కడా ఉండేటట్లు కూడా లేదు. ఇల్లు లేకపోతే.. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బ్రతుకొచ్చులే అనుకుంటాం. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోతోంది. ఇళ్ల అద్దెలు భారీగా పెరిగిపోవడం ఇందుకు కారణం.

Bengaluru: బాత్రూమ్ సైజు లేదు.. రెంట్ మాత్రం రూ. 12 వేలు.. ఎక్కడో తెలుసా?
Bengaluru Room Rent
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 11, 2023 | 11:34 AM

Peak Bengaluru: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ఈ పాట గుర్తుందా? ఒకవేళ మర్చిపోయినా.. నేటి పరిస్థితులు వెంటనే గుర్తు చేస్తాయిలేండి. అవును మరి.. నేడు చాలా మంది పరిస్థితి ఇలానే ఉంది. ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. కొత్తగా ఎక్కడా ఉండేటట్లు కూడా లేదు. ఇల్లు లేకపోతే.. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బ్రతుకొచ్చులే అనుకుంటాం. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోతోంది. ఇళ్ల అద్దెలు భారీగా పెరిగిపోవడం ఇందుకు కారణం. కాలానుగుణంగా దేశం, దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధి చెందితే జీవితం బాగుంటుంది లే అనుకుంటే పొరపడినట్లే. పెరిగిన ధరలతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అడుగు బయటకకు పెడితే చాలు.. డబ్బులు ఎగిరిపోతున్నాయి.

ఇలాంటి తరుణంలో.. బెంగళూరుకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో సంచలనంగా మారింది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో బెంగళూరు ఒకటి. అందుకే బెంగళూరు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ట్రాపిక్, వర్షం, అక్కడి అధిక ధరలు.. అంశమేదైనా.. టాప్‌లోనే ఉంటుంది. తాజాగా ఇలాంటి విషయంలోనే బెంగళూరు మరోసారి వైరల్‌గా మారింది.

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు ఉపాధి కోసం బెంగళూరుకు వస్తుంటారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్, ఎంప్లాయిస్ ఉద్యోగరిత్యా బెంగళూరులో మకాం ఏర్పాటు చేసుకుంటారు. బెంగళూరులో ఇప్పుడు ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే.. ‘నో బ్రోకర్’లో ఒక లిస్టింగ్‌లో కేవలం ఒక బెడ్‌కు సరిపోయే గది అద్దె ఏకంగా రూ. 12,000 ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఫోటోతో సహా రెడ్డిట్‌లో @saiyaa అనే యూజర్ పోస్టు చేశారు. ఈ గది ఎంత ఇరుకైందంటే.. ఒకే మంచం ఫిక్స్ అయ్యింది. కొంచెం కూడా ఖాళీ లేదు. దాంతో షాక్ అవడం ఆ యూజర్ వంతు అయ్యింది. ఈ పోస్ట్ చూసిన వారికి సైతం మైండ్ బ్లాంక్ అయ్యింది. బెంగళూరులో రెంట్స్ మరీ ఇంత ఎక్కువగా ఉన్నాయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

A room for bed is a bedroom. WTF Bangalore : ) byu/saiya inindia

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..