Bus Stop Stole: వీళ్లు మామూలోళ్లు కాదు.. బెంగళూరులో ఏకంగా బస్టాప్‌నే లేపేసారు.

Bus Stop Stole: వీళ్లు మామూలోళ్లు కాదు.. బెంగళూరులో ఏకంగా బస్టాప్‌నే లేపేసారు.

Anil kumar poka

|

Updated on: Oct 11, 2023 | 9:08 PM

బస్టాపుల్లో జేబు దొంగలు, చైన్‌ స్నాచర్లను చూశాం. కానీ వీడెవడో ఏకంగా బస్‌స్టాప్‌కే ఎసరు పెట్టాడు. అసలక్కడ బస్‌ షెల్డర్‌ ఉండేదా ? అనే సందేహం కలిగేలా కనీసం అనవాళ్లు కూడా లేకుండా సాంతం ఎత్తుకెళ్లాడు. ఈ విచిత్ర ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్డు వాహనాల రాకపోకలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అక్కడ బెంగళూరు మెట్రోపోలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ కొత్తగా బస్టాప్‌లో షెల్టర్‌ను నిర్మించింది.

బస్టాపుల్లో జేబు దొంగలు, చైన్‌ స్నాచర్లను చూశాం. కానీ వీడెవడో ఏకంగా బస్‌స్టాప్‌కే ఎసరు పెట్టాడు. అసలక్కడ బస్‌ షెల్డర్‌ ఉండేదా ? అనే సందేహం కలిగేలా కనీసం అనవాళ్లు కూడా లేకుండా సాంతం ఎత్తుకెళ్లాడు. ఈ విచిత్ర ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్డు వాహనాల రాకపోకలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అక్కడ బెంగళూరు మెట్రోపోలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ కొత్తగా బస్టాప్‌లో షెల్టర్‌ను నిర్మించింది. దాదాపు 10 లక్షల విలువైన సామాగ్రితో స్టెయిన్‌లెస్-స్టీల్‌తో అధునాతన వసతులతో దీనిని నిర్మించింది. అయితే బస్‌షెల్టర్ నిర్మించిన వారం రోజుల్లోనే దొంగలు దానిని మాయం చేశారు. అదును చూసి ఎవరూ లేని సమయంలో చోరీ చేసి బస్‌షెల్టర్‌ను విడిభాగాలుగా విడగొట్టి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బస్టాప్‌ను నిర్మించిన కంపెనీ ప్రతినిధి ఎన్‌ రవి రెడ్డి స్పందిస్తూ కాఫీ డేకి దగ్గరలో తాము బస్‌ షెల్టర్‌ నిర్మించామని, ఆగస్టు 21న దాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆగస్టు 28వ తేదీన ఉదయం నాటికి అది మాయమైపోయిందని స్థానిక మీడియాకు చెప్పారు. దీనిపై రవి రెడ్డి సెప్టెంబర్‌ 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్టాప్‌నును ఉద్దేశపూర్వకంగానే తొలగించారా అని బీబీఎంపీ అధికారులను అడిగామని, తామేం తీయలేదని వారు చెప్పారని రవి రెడ్డి వివరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 11, 2023 12:04 PM