Telangana: నీళ్ల కోసం ఊరి చివరి బావిలో దిగిన గిరిజనులు.. ఒక్కసారిగా కనిపించిన సీన్‌ చూసి పరుగో పరుగు..

ఈ సందర్భంగా వన్యప్రాణులు తారసపడినప్పుడు, ఎలాంటి ఆపద కలుగ కుండా జాగ్రత్తలు వహించి, వాటిని చంపకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు. ఎక్కడైనా పాములు, వన్యప్రాణులు కనిపిస్తే.. సంబంధిత అధికారులు, సిబ్బంది, స్నేక్ క్యాచర్ లకు గాని, ఫారెస్ట్ అధికారులకు గాని సమాచారాన్ని అందించాలని సూచించారు. కొండ చిలువలకు గానీ, సాదు జంతువులకు గాని , పశువులకు గాని చుట్టుకున్నప్పుడు

Telangana: నీళ్ల కోసం ఊరి చివరి బావిలో దిగిన గిరిజనులు.. ఒక్కసారిగా కనిపించిన సీన్‌ చూసి పరుగో పరుగు..
Giant Python
Follow us
G Peddeesh Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 11, 2023 | 11:58 AM

వరంగల్ జిల్లా, అక్టోబర్11; నీటికోసం బావి వద్దకు వెళ్లిన తండావాసులకు ఆ నీటిలో కొండచిలువ కనిపించింది.. కొందరు పరుగులు పెట్టగా మరికొందరు ఆ కొండచిలువ ను పట్టుకునే ప్రయత్నం చేశారు.. ఆ కొండచిలువ ఒక వ్యక్తి కాళ్ళు – చేతులకు చుట్టుకోవడంతో మిగిలిన వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ శివారు టేకులతండా లో జరిగింది… రోజువారీ పనుల్లో భాగంగా పంట పొలాల మధ్యలో ఉన్న బావిలో మంచినీటి కోసం వెళ్లారు స్థానిక గిరిజన రైతులు… ఈ క్రమంలో బావి నీటిలో కొండ చిలువ కనిపించింది. పట్టుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్తుల కాళ్లకు చుట్టుకుంది.. దీంతో స్థానికులు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు..

సమాచారం అందిన వెంటనే స్నేక్ క్యాచర్ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు.. కొండచిలువను విడిపించి అతడి ప్రాణాలు కాపాడాడు. కొండచిలువను బంధించి అక్కడి ప్రజలకు పాముల పట్ల అవగాహన కల్పించారు.. అనంతరం ఆ కొండ శిలువను పట్టుకొని సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో ఎవరికీ ఎలాంటి అపాయం సంభవించలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సందర్భంగా వన్యప్రాణులు తారసపడినప్పుడు, ఎలాంటి ఆపద కలుగ కుండా జాగ్రత్తలు వహించి, వాటిని చంపకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు. ఎక్కడైనా పాములు, వన్యప్రాణులు కనిపిస్తే.. సంబంధిత అధికారులు, సిబ్బంది, స్నేక్ క్యాచర్ లకు గాని, ఫారెస్ట్ అధికారులకు గాని సమాచారాన్ని అందించాలని సూచించారు. కొండ చిలువలకు గానీ, సాదు జంతువులకు గాని , పశువులకు గాని చుట్టుకున్నప్పుడు ఏవిధంగా వాటిని కాపాడుకోవాలో మెళకువలు నేర్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా