Hyderabad: సమయం లేదు మిత్రమా..! ఎన్నికల వేళ ప్రచార వాహనాలకు ఫుల్ డిమాండ్.. పోటా పోటీ కొనుగోళ్లు..

Telangana: ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో డిజిటల్ ఫ్లెక్సీలకు మార్కేట్లో డిమాండ్ ఉండటంతో డిజిటల్ బ్యానర్లు..ఫ్లెక్సిలను ప్రచార రథాలకుఅమరుస్తున్నారు. కొన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కాగా మరికొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించపోయినప్పటికీ.. ఎవరికి వారు తామే అభ్యర్థులమంటూ కొందరు నేతలు ప్రచార రథాలను సిద్దం చేసుకుంటున్నారు.. ఎది ఎమైనా ఎలక్షన్ పుణ్యమా అని రెండు చేతులా పనిదోరికిందంటున్నారు కార్మికులు.

Hyderabad: సమయం లేదు మిత్రమా..! ఎన్నికల వేళ ప్రచార వాహనాలకు ఫుల్ డిమాండ్.. పోటా పోటీ కొనుగోళ్లు..
Campaigning Vehicles
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 11, 2023 | 10:00 AM

హైదరాబాద్,అక్టోబర్11; ఎన్నికల తేదీ వచ్చేసింది.. ఊరువాడ, పల్లెపట్టణం తేడా లేకుండా పార్టీల జెండాలు రెపరెపలాడబోతున్నాయి.. మైకుల మోతలతో ప్రచారం ఊపందుకుంటోంది.. ఏ పార్టీ ప్రచారమైనా మస్ట్ గా ఉండేటివి ప్రచార వాహానాలే.. అధికార పార్టీ..ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా ప్రతి పార్టీ ఎన్నికల ప్రచారాలతో గెలుపు బాట పట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరగనున్న ప్రచార రధాలకు డిమాండ్ పెరిగింది. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల నేతలు ప్రచారం షురూ చేసారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎక్కడ చూసిన ప్రచార వాహనాలు రేడి అవుతున్నాయి..దీంతో సిటీ లోని కార్పెంటర్స్, ఫ్లెక్సీ డిజైనర్స్, ఆర్టిస్ట్ లు ప్రచారపు వాహనాల తయారీలో బిజీ అయ్యారు..

అసెంబ్లీ ఎన్నికలు కావడంతో లోకల్ పార్టీ నుండి సెంట్రల్ పార్టీ దాకా ప్రతి ఒకరు తమ స్థాయి లో జోరుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు సర్వం సిద్దం చేసుకున్నారు.. ఇప్పటికే సిటిలోని అనేక చోట్ల చాలమంది కార్మికులు ప్రచార వాహనాలను రెడీ చేసే బిజీలో పడ్డారు..దాదాపు ఒక వాహనాన్ని రెడీ చేయడానికి ఐదు ఆరు గంటల సమయం పడుతుందని అంటున్నారు కార్పేంటర్స్.. ఓటర్లు అట్రాక్ట్ అయ్యే విధంగా పార్టీ రంగులు..పథకాలు..నాయకుల పేర్లతో ప్రచార రథాలు సిద్దం చేస్తున్నట్టుగా చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ ప్రచార వాహనాలను సిద్ధం చేస్తున్నారు..

ఇలా రెడీ అయినా వాహనాలకు మంచి డెకరేషన్ చేసి మైక్ సెట్ ను ఫిక్స్ చేసి ఫ్లెక్సీలను కడుతారు…ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో డిజిటల్ ఫ్లెక్సీలకు మార్కేట్లో డిమాండ్ ఉండటంతో డిజిటల్ బ్యానర్లు..ఫ్లెక్సిలను ప్రచార రథాలకుఅమరుస్తున్నారు. కొన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కాగా మరికొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించపోయినప్పటికీ.. ఎవరికి వారు తామే అభ్యర్థులమంటూ కొందరు నేతలు ప్రచార రథాలను సిద్దం చేసుకుంటున్నారు.. ఎది ఎమైనా ఎలక్షన్ పుణ్యమా అని రెండు చేతులా పనిదోరికిందంటున్నారు కార్మికులు.

ఇవి కూడా చదవండి

ఈ బండ్ల పైన ఎలక్షన్ తేదీ ని తమ పార్టీ గుర్తు ను హైలెట్ చేస్తారు..ఎక్కువగా డీసీఎం , గూడ్స్ ఆటోలోనే ప్రచారం చేస్తారని.. ఒక్కో అభ్యర్థి నాలుగు నుండి ఐదు ప్రచార రథాలను తయారు చేయించుకుంటన్నారంటున్నారు ప్రచార రథాల తయారీ దారులు..క్యాండిట్లకు స్పేషల్ గా వారి పార్టీ అమలు చేసిన సంక్షేమపథకాలు..అధికారంలోకి వస్తే  కొత్తగా అమలు చేసే పథకాలను వాహనాలపై కనిపించేల ఒక వాహనం.. కళకారులు ఆట పాటలకు మరో వాహనం సిద్దం చేస్తునామంటున్నారు ఇలా ఒకే సారి బల్క్ గా అర్డర్స్ వస్తునాయంటున్నారు వాహనాల తయారీ దారులు. ప్రచార వాహనాలతో పాట ఫ్లేక్సీలకు..కండువాలకు..జేండు..టోపిల పార్టీ వస్త్రాలకు ఫుల్ డిమాండ్ మార్కట్లో కనిపిస్తుంది..హైదరాబాద్ నుండి అన్ని జిల్లాలకు వాహనాలను రేడీ చేసి పంపిస్తున్నారు పార్టీల నేతలు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా