AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డంప్ యార్డ్‌లో భారీగా ఎగడిసిపడ్డ మంటలు.. అదిచూసి జనాలు హ్యాపీ.. ఎందుకంటే..

Hyderabad Drugs: హైదరాబాద్‌ శివారు దుండిగల్‌ డంప్‌ యార్డ్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. అది చూసిన జనాలు.. అగ్ని ప్రమాదం కావచ్చని అనుకున్నారు. ఇంకేముంది.. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ఘటనా స్థలకి వెళ్లారు. అక్కడ తలగబడుతున్న దానికి చూసి.. ఓ పనై పోయింది. మంట మంచికే అనేశారు. ఎందుకుంటే నిప్పు వెనుక నిజం అలాంటిది మరి. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Hyderabad: డంప్ యార్డ్‌లో భారీగా ఎగడిసిపడ్డ మంటలు.. అదిచూసి జనాలు హ్యాపీ.. ఎందుకంటే..
Drugs Smash
Shiva Prajapati
|

Updated on: Oct 11, 2023 | 10:01 AM

Share

Hyderabad Drugs: హైదరాబాద్‌ శివారు దుండిగల్‌ డంప్‌ యార్డ్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. అది చూసిన జనాలు.. అగ్ని ప్రమాదం కావచ్చని అనుకున్నారు. ఇంకేముంది.. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ఘటనా స్థలకి వెళ్లారు. అక్కడ తలగబడుతున్న దానికి చూసి.. ఓ పనై పోయింది. మంట మంచికే అనేశారు. ఎందుకుంటే నిప్పు వెనుక నిజం అలాంటిది మరి. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టచ్‌ చేస్తే.. నిషా.. ఆ లెవల్లో మహానగరంలో మత్తు సరుకు పట్టుబడుతోంది. డ్రగ్‌ దందాపై ఉక్కుపాదం మోపిన పోలీసులు.. ఎప్పటికప్పుడు మత్తు ముఠాల బెండు తీస్తున్నారు. కానీ శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టుగా రకరకాల మార్గాల్లో డ్రగ్స్ బట్వాడా కొనసాగుతోంది. అంతకన్నా ధీటుగా పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడికక్కడ డ్రగ్స్‌ను సీజ్‌ చేస్తున్నారు. అలా దఫదఫాలుగా పేరుకుపోయిన సరుకు ఏమైపోతుంది? ఎక్కడకు వెళ్తోంది? ఈ ప్రశ్నలకు సమాధనంగా దుండిగల్‌లో పొగరేగింది.

గంజాయి తోటల ధ్వంసం.. పట్టుబడిన గంజాయిని తగలేయ్యడం ఇది రెగ్యూలర్‌ ప్రాసెస్‌. కొకైన్‌, హెరాయిన్‌ వంటి డ్రగ్స్‌ సహా ఇటీవల కాలంలో ఈ సిగిరెట్స్‌ కూడా తనిఖీల్లో పట్టుబడుతుంటాయి. అలా సీజ్‌ చేసిన మత్తు సరంజామాకు దుండిగల్‌‌లో మంట పెట్టారు. ఇటీవల కాలంలో కస్టమ్స్‌ అండ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ 216 కేజీల డ్రగ్స్‌ను సీజ్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

పట్టుబడిన సరుకులో గ్రాము ఇటు అటు అయినా పెద్ద తేడాలొస్తాయి. కాబట్టీ రికార్డుల్లో పక్కగా లెక్కను నమోదు చేశారు. అలా పేరుకుపోయిన డ్రగ్స్‌ను ప్యాక్‌ చేసి దుండిగల్‌ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లో తరలించారు. అధికారుల సమక్షంలో వాటిని ధ్వంసం చేశారు. బూడిదైన మత్తు సరుకు విలువ ఎటూ లేదన్న రూ. 469 కోట్లు ఉంటుందట. ఖరీదు ఎంతయితేనేంటి? బతుకుల్ని ఖరాబు చేసే మత్తు పదార్ధాలను మటాష్‌ చేయాల్సిందే. DRI అధికారులు అదే పని చేసేశారు. ధ్వంసమైన సరుకులో విదేశాల నుంచి గుట్టుగా తరలించిన ఖరీదైన డ్రగ్స్‌ వున్నాయి. ఈ సిగర్స్‌ కూడా వున్నాయి. ఇదన్నమాట ఆ మంటల వెనుక ఉన్న మంచి వార్త.

శంషాబాద్‌లో స్మగ్లర్ల అరెస్ట్..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు అక్రమ బంగారంతో పాటు ఖరీదైన సెల్ ఫోన్ లను గుర్తించారు‌. దుబాయ్, షార్జా, వంటి దేశాల నుండి అక్రమంగా బంగారం, సెల్ ఫోన్ లు తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా ఆధికారులకు పట్టుబడి కటకటాలకు వెళుతున్నారు. అయితే తాజాగా కస్టమ్స్ అధికారుల కళ్ళు కప్పి స్మగ్లర్లు బంగారం, ఐఫోన్ లు ఎయిర్ పోర్ట్ లోని పార్కింగ్ లో వేరే వాళ్ళకు అప్పగించే క్రమంలో అడ్డంగా దొరికిపోయారు. స్మగ్లర్ల నుండి బంగారం, సెల్ ఫోన్ లు, 18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు. పట్టుబడ్డ బంగారం, సెల్ ఫోన్ లు, నగదును కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. నింధితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..