Telangana Elections: తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం.. ఏఐసీసీ యాక్షన్ ప్లాన్ ఇదేనా?!

Telangana Congress: తెలంగాలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం తన వ్యూహాలకు పదును పెట్టిందా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీ అగ్రనేతలు తెలంగాణాలోనే మకాం వేయనున్నారా? 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో సైతం కాంగ్రెస్‌కి సానుకూలంగా ఉండడంతో ఏఐసీసీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ప్రత్యేక కథనం మీకోసం..

Telangana Elections: తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం.. ఏఐసీసీ యాక్షన్ ప్లాన్ ఇదేనా?!
Congress Party
Follow us
TV9 Telugu

| Edited By: Shiva Prajapati

Updated on: Oct 10, 2023 | 7:49 PM

Telangana Congress: తెలంగాలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం తన వ్యూహాలకు పదును పెట్టిందా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీ అగ్రనేతలు తెలంగాణాలోనే మకాం వేయనున్నారా? 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో సైతం కాంగ్రెస్‌కి సానుకూలంగా ఉండడంతో ఏఐసీసీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ప్రత్యేక కథనం మీకోసం..

ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే.. మరోవైపు పార్టీ బలోపేతానికి చేరికలపైనా ఫోకస్ పెట్టింది. అయితే ప్రజల్లోకి మరింత దూసుకెళ్లడానికి తెలంగాణలోనే అగ్రనేతలు మకాం వేసేలా వరుస పర్యటనలకు సిద్ధమవుతుంది కాంగ్రెస్. భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో పాటు.. ప్రకటించిన 6 గ్యారెంటీలను తెలంగాణలో డోర్ టూ డోర్ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే గత నెలలో సిడబ్ల్యూసీ సమావేశాలు, తుక్కుగూడ భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ సత్తా ఏంటో ఇతర పార్టీలకు చూపించింది. అగ్రనేతలైన సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ లతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు 3రోజుల పాటు రాష్ట్రంలోనే పర్యటించారు ఆ సమమయంలో పార్టీకి కొత్త జోష్ వచ్చింది.

తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో.. మరోసారి అగ్రనేతలు పర్యటించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం. ఈ నెల రెండవ వారం తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. దాదాపు మూడు రోజులపాటు రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ ఉండనున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు పెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన కాంగ్రెస్.. తాజాగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై మరింత ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు రోజుల్లో ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ నేతలతో సమావేశాలు, భారీ బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలు ఉండే విధంగా పీసీసీ కార్యాచరణ రూపొందిస్తుంది. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ వేవ్ స్టార్ట్ అయిందని, దీనికి తోడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రాహుల్ గాంధీతో పాటు ఈనెల చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ప్రియాంక గాంధీ సైతం తెలంగాణలో పర్యటించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభతో మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించాలని భావిస్తోంది కాంగ్రెస్. వీరితో పాటు షాద్ నగర్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో బిసి డిక్లరేషన్‌ను ప్రకటించాలని కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్రమంత్రులు, ఇతర జాతీయ స్థాయి నేతలందరినీ తెలంగాణలో పర్యటించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. చివరకు ఎన్నికలకు రెండు రోజుల ముందు రాహుల్ గాంధీతో హైదరాబాద్‌లో ఎన్నికల ర్యాలీకి సిద్ధం చేస్తున్నారు. డిక్లరేషన్లు, గ్యారంటీలు, భారీ చేరికలను, జాతీయ నేతలతో సభలను నమ్ముకొని ఎలాగైనా గెలవాలనుకుంటున్న కాంగ్రెస్ గెలుస్తుందో.. ఎన్నికల చదరంగంలో ఎలా వ్యవరిస్తుందో చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..