Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆ శబ్ధం విని సంభోగానికి పరుగెత్తుకుంటూ వచ్చిన 3 వేల మొసళ్లు.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..

మానవులు, జంతువులలో సంతానోత్పత్తి అనేది సాధారణ ప్రక్రియ. ప్రకృతి ఈ ప్రక్రియను పూర్తి చేసే అనేక వ్యవస్థలను కూడా ప్రేరేపిస్తుంది. మనుషుల మాదిరిగానే.. జంతువులు, పక్షులు కూడా పునరుత్పత్తికి కొన్ని అంశాలను ముఖ్యమైనవిగా పరిగణిస్తాయి. జంతువులు తమ సంతానోత్పత్తి కాలంగా నిర్దిష్ట కాలాన్ని, సమయాన్ని నిర్దేశిస్తాయి

Viral: ఆ శబ్ధం విని సంభోగానికి పరుగెత్తుకుంటూ వచ్చిన 3 వేల మొసళ్లు.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..
Crocodiles Mating
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 07, 2023 | 10:53 AM

Crocodile Mating: మానవులు, జంతువులలో సంతానోత్పత్తి అనేది సాధారణ ప్రక్రియ. ప్రకృతి ఈ ప్రక్రియను పూర్తి చేసే అనేక వ్యవస్థలను కూడా ప్రేరేపిస్తుంది. మనుషుల మాదిరిగానే.. జంతువులు, పక్షులు కూడా పునరుత్పత్తికి కొన్ని అంశాలను ముఖ్యమైనవిగా పరిగణిస్తాయి. జంతువులు తమ సంతానోత్పత్తి కాలంగా నిర్దిష్ట కాలాన్ని, సమయాన్ని నిర్దేశిస్తాయి. ఆ సమయంలో సంభోగానికి సిద్ధమవుతాయి. జంతువులు సంభోగం కోసం రుతుపవనాల ఆగమనం వంటి నిర్దిష్ట సమయాలను పాటిస్తాయి. వాటి సంభోగానికి అనుకూలమైన సమయాన్ని ఎంచుకుంటాయి.

సంభోగం సమయంలో వింత శబ్దాలను విడుదల చేసే జంతువులు..

సంభోగం సమయంలో కొన్ని రకాల జంతువులు, పక్షులు విచిత్రమైన శబ్ధాలనుు చేస్తాయి. ఇది తమ భాగస్వాములను సంభోగానికి ఆహ్వానించే ప్రక్రియ. కానీ, ఈ శబ్ధాలు మనకు వింతగా వినిపిస్తాయి. ఎక్కడో సుదూరంగా ఉన్న తమ భాగస్వాములతో సంభోగం కోసం ఆహ్వానించడానికి జంతువులు ఇలాంటి అసాధారణ శబ్దాలను చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ శబ్దం మనకు వింతగా అనిపించినప్పటికీ, ఇది జంతు ప్రపంచంలో ఐక్యతకు చిహ్నం.

మొసళ్లను కన్‌ఫ్యూజ్ చేసిన హెలికాప్టర్ శబ్ధం..

ఆస్ట్రేలియాలోని ఒక చెరువును మొసళ్లు ఆవాసంగా చేసుకుని జీవిస్తున్నాయి. దాదాపు 3 వేల మొసళ్లు అందులో జీవిస్తుండగా.. ఇటీవల కాలానికి ముందే పునరుత్పత్తి కార్యకలాపాలలో నిమగ్నమయ్యాయట. తద్వారా ప్రక్రియను మర్చేశాయట. వాస్తవానికి మొసళ్లు నిర్దిష్ట సమయాల్లోనే సంభోగం ప్రక్రియలో పాల్గంటాయి. అయితే, ఈ మొసళ్లు సీజన్‌కు ముందే.. జతకట్టాయి. దీని కారణం.. హెలికాప్టర్. కూరోనా క్రోకొడైల్ ఫామ్ యజమాని జాన్ లివర్ తన ఫామ్ కేంద్రంలో మొసళ్లు షెడ్యూల్ కంటే ముందే సంభోగంలో పాల్గొనడం చూసి షాక్ అయ్యాడట. దీనికి కారణం ఏమై ఉంటుందోనని ఆందోళన చెందాడు. అయితే, విషయాన్ని పరిశీలిస్తే.. హెలికాప్టర్ శబ్ధాన్ని తప్పుగా భావించి.. మొసళ్లు సంభోగంలో పాల్గొన్నట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

శబ్ధాన్ని తప్పుగా భావించిన ఆడ మొసళ్లు..

అయితే, పొలం చెరువుు పక్కనే సైనిక శిక్షణా శిభిరం ఉంది. అప్పుడప్పుడు శిక్షణా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మిటలరీ హెలికాప్టర్స్.. ఆ చుట్టుపక్కన తిరుగుతూ ఉంటాయి. వాటి శబ్ధాలతో ఆ ప్రాంతం అంతా మోత మోగిపోతుంటుంది. అయితే, శబ్ధం ఏదైనా.. నీటిలో దాని ఫ్రీక్వెన్సీలో తేడా ఉంటుంది. హెలికాప్టర్ శబ్ధం కూడా నీటి వద్దకు రాగానే వింతగా వినిపించింది. ఈ శబ్ధాన్ని ఆడ మొసళ్లు తప్పుగా అర్థం చేసుకున్నాయి. మగ మొసళ్లు సంభోగానికి పిలుస్తున్నాయని భావించి.. ఏకంగా 3 వేల మొసళ్లు సంభోగంలో పాల్గొన్నాయి.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..