Bigg Boss 7 Telugu: రైతు బిడ్డపై ఆ వల్గర్ మాటలేంటి ?.. ఎందుకంత చిన్న చూపు.. సీరియల్ బ్యాచ్ పై అఖిల్ సార్థక్ ఫైర్..

పల్లవి ప్రశాంత్ ను రారా, రా, అరేయ్ అంటూ చాలా వల్గర్ గా మాట్లాడారు కొంతమంది. అప్పటికీ ప్రశాంత్ అన్న, అక్క అంటూ చాలా మర్యాద ఇచ్చి మాట్లాడాడు. అదే స్థానంలో శివాజీ ఉంటే అలా మాట్లాడేవారా ?. ప్రశాంత్ కాబట్టి అంత చిన్న చూపు చూశారా ?. అందరూ తనను డామినేట్ చేస్తున్నారనిపించింది. నామినేషన్స్ అంటూ అందరూ మాట్లాడతారు కానీ అతడిని మాట్లాడనివ్వరన్నమాట. వాళ్లు చెప్పే పాయింట్స్ కరెక్ట్. కానీ అతడిని అలా మాట్లాడనివ్వకపోవడం అస్సలు కరెక్ట్ కాదు.

Bigg Boss 7 Telugu: రైతు బిడ్డపై ఆ వల్గర్ మాటలేంటి ?.. ఎందుకంత చిన్న చూపు.. సీరియల్ బ్యాచ్ పై అఖిల్ సార్థక్ ఫైర్..
Akhil Sarthak
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2023 | 5:00 PM

బిగ్‏బాస్ సీజన్ 7 రెండో వారం నామినేషన్ ప్రక్రియ ఏ రేంజ్‏లో హీటెక్కిందో చెప్పక్కర్లేదు. అంతా మూకుమ్మడిగా పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు. ముఖ్యంగా అంతా కలిసి ప్రశాంత్ పై చేసిన కామెంట్స్ మాత్రం కావాలని ప్లాన్ చేసి మరీ నామినేట్ చేసినట్లుగా కనిపిస్తోంది. అర్థంలేని రీజన్స్ చెబుతూ.. రైతులు, బీటెక్ స్టూడెంట్స్ అంటూ అవసరం లేని పాయింట్స్ తీస్తూ పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది.  నామినేషన్స్ కు ముందు రోజు రాత్రే ప్రశాంత్ ను కలిసి కట్టుగా నామినేట్ చేయాలని సీరియల్ బ్యాచ్ డిసైడ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అయితే అంతా కలిసికట్టుగా ప్రశాంత్ ను నామినేట్ చేయడంతో సోషల్ మీడియాలో మాత్రం హీరో అయిపోయాడు ప్రశాంత్. అందరూ కలిసి ఒకడిని టార్గెట్ చేసి తక్కువ చేసి మాట్లాడుతున్నా మర్యాదగా మాట్లాడాడు ప్రశాంత్. అన్న, అక్క అంటూ తన పాయింట్స్ చెప్పాలని ప్రయత్నించాడు. అయితే అతడిని ఏమాత్రం మాట్లాడనివ్వకుండా రైతు బిడ్డను అంటూ సింపథీ డ్రామా ప్లే చేస్తున్నావంటూ దాడి చేశారు. ముఖ్యంగా అమర్ దీప్ హద్దుమీరి మరీ మాట్లాడాడు. అరేయ్, రారా పోరా అంటూ ప్రతిసారి ప్రశాంత్ ను తక్కువ చేసి మాట్లాడగా.. ప్రశాంత్ మాత్రం అన్నా అంటూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాడు.

అయితే తాజాగా ఈ విషయంపై బిగ్ బాస్ రన్నరప్ అఖిల్ సార్థక్ స్పందించాడు. పల్లవి ప్రశాంత్ కు అందరూ భయపడి మరీ టార్గెట్ చేశారు. రైతుబిడ్డ నువ్వు స్ట్రాంగ్ గా ఉండు అని ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. ఇక తాజాగా మరోసారి అదే విషయంపై ఓ వీడియో షేర్ చేశాడు అఖిల్. “పల్లవి ప్రశాంత్ ను రారా, రా, అరేయ్ అంటూ చాలా వల్గర్ గా మాట్లాడారు కొంతమంది. అప్పటికీ ప్రశాంత్ అన్న, అక్క అంటూ చాలా మర్యాద ఇచ్చి మాట్లాడాడు. అదే స్థానంలో శివాజీ ఉంటే అలా మాట్లాడేవారా ?. ప్రశాంత్ కాబట్టి అంత చిన్న చూపు చూశారా ?. అందరూ తనను డామినేట్ చేస్తున్నారనిపించింది. నామినేషన్స్ అంటూ అందరూ మాట్లాడతారు కానీ అతడిని మాట్లాడనివ్వరన్నమాట. వాళ్లు చెప్పే పాయింట్స్ కరెక్ట్. కానీ అతడిని అలా మాట్లాడనివ్వకపోవడం అస్సలు కరెక్ట్ కాదు. రతిక ప్రశాంత్ ను ట్రాక్ చేయాలని ట్రై చేసింది. కానీ చివరకు అతడినే అనేసింది.

ఇవి కూడా చదవండి

ఇక ప్రశాంత్ బిగ్ బాస్ అన్ని సీజన్స్ చూసి వచ్చాడని అన్నారు. ఈ షోకు రావాలని దండం పెట్టి అడుక్కుని వచ్చాడని అంటారు. మనం ఒకరిని అడిగేటప్పుడు కచ్చితంగా దండం పెడతాము. ఎవరూ కోపంగా అడగరు. అతను అదే చేశాడు. వచ్చినప్పటి నుంచి అతను గేమ్ కోసం ఆడుతున్నాడు. ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అఖిల్ వీడియోకు అనీ మాస్టర్ సపోర్ట్ ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.