Oka Chinna Family Story: టీవీల్లోకి వచ్చేస్తోన్న వెబ్ సిరీస్.. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ఎక్కడ చూడొచ్చంటే..

ఇప్పటివరకు డిజిటల్ ప్లాట్ ఫాం పై సందడి చేసిన ఓ వెబ్ సిరీస్ టీవీలో రాబోతుంది. అదే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ సీరిస్‏కు విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు ఇదే సిరీస్ జీ సినిమాలు ఛానల్లో ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. ఈ సిరీస్ జీ సినిమాలు ఛానెల్లో సెప్టెంబర్ 15న మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానున్నట్లు ప్రకటించింది. తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ టీవీలో రాబోతుండడంతో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సిరీస్ చూసేందుకు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.

Oka Chinna Family Story: టీవీల్లోకి వచ్చేస్తోన్న వెబ్ సిరీస్.. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' ఎక్కడ చూడొచ్చంటే..
Oka Chinna Family Story
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 12, 2023 | 3:04 PM

ప్రస్తుతం థియేటర్లలో సూపర్ హిట్ మూవీస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరోవైపు సరికొత్త కంటెంట్ థ్రిల్లర్, కామెడీ వెబ్ సిరీస్‏లతో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు డిజిటల్ ప్లాట్ ఫాం పై సందడి చేసిన ఓ వెబ్ సిరీస్ టీవీలో రాబోతుంది. అదే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ సీరిస్‏కు విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు ఇదే సిరీస్ జీ సినిమాలు ఛానల్లో ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. ఈ సిరీస్ జీ సినిమాలు ఛానెల్లో సెప్టెంబర్ 15న మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానున్నట్లు ప్రకటించింది. తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ టీవీలో రాబోతుండడంతో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సిరీస్ చూసేందుకు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ లోని అన్ని ఎపిసోడ్లను కలిపి ఓ సినిమాగా ప్రసారం చేయనున్నారు. దీంతో ఒకేసారి అన్ని ఎపిసోడ్స్ కలిసి బ్రేక్ లేకుండా సినిమాగా చూడొచ్చు. ఇందులో సంగీత్ శోభన్, నరేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎలాంటి బాధ్యతలు లేకుండా బలాదూర్‏గా తిరిగే ఓ యువకుడి జీవితంలో తన తండ్రి మరణంతో మలుపులు తిరిగింది. రూ.25 లక్షల బ్యాంక్ లోన్ తీసుకొని అది కట్టకుండా చనిపోయినట్లు తెలవడంతో ఆ యువకుడు షాక్ తింటాడు. ఆ తర్వాత వారి కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ యువకుడు ఆ లోన్ ఎలా తీర్చాడు. ఆ డబ్బు ఏం చేశాడు అనేది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ.

ఇవి కూడా చదవండి

డెరెక్టర్ మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిజిటల్ ప్లా్ట్ ఫామ్ పై మంచి రెస్పాన్స్ అందుకుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక కొణిదెల ఈ సిరీస్ ను నిర్మించారు. జీ5 ఓటీటీలో అలరించిన ఈ సిరీస్ జీ సినిమాలు ఛానల్లో సెప్టెంబర్ 15న మాధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనున్నారు. ఇప్పటివరకు ఓటీటీలో చూడనివారు ఈ సిరీస్ ను సినిమాగా టీవీలోనే చూడొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.