Krishna Mukunda Murari Episode 12th September: అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్న కృష్ణ.. తన ప్రేమని కృష్ణకు చెప్పేయాలని ముకుంద.. రేపటి ఎపిసోడ్‌లో సూపర్ ట్విస్ట్..

కృష్ణతో నీతో తర్వాత గొడవ పదువుగానీ ఇప్పుడు నాతొ గొడవ పడుదువుగానీ రా అని అంటుంది. హాస్పటల్ కు నీతో వస్తా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి.. అని అంటుంటే.. ఇక్కడ చెప్పవచ్చు కదా.. అని అంటుంటే.. ఇక్కడే చెప్పెయ్యి అని అంటుంది కృష్ణ. ఏసీపీ సార్ కు మెసేజ్ చేస్తా అని అంటే.. నేను చెప్పే విషయం అయ్యేవరకూ సెల్ స్విచ్ ఆఫ్ చెయ్యి అని అని నామీద నీకు నమ్మకం లేదా అని అంటుంది ముకుంద..

Krishna Mukunda Murari Episode 12th September: అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్న కృష్ణ.. తన ప్రేమని కృష్ణకు చెప్పేయాలని ముకుంద.. రేపటి ఎపిసోడ్‌లో సూపర్ ట్విస్ట్..
Krishna Mukunda Murari
Follow us
Surya Kala

|

Updated on: Sep 14, 2023 | 6:30 AM

కృష్ణకు మా మీద చిన్న చిన్నగా డౌట్ వచ్చేలా చేసి ఏదొక రోజు మా విషయం ఫుల్ గా చెప్పేస్తానని ముకుంద  అనుకుంటుంటే.. అలేఖ్య వస్తుంది. సంతోషంగా ఉన్నావు అని అలేఖ్య అంటే.. తనకు ఇక నుంచి అన్నీ హ్యాపీ డేస్ నే అని అంటుంటే.. నువ్వు ఒక విషయం మరచిపోతున్నావు ముకుంద.. నువ్వు మొన్న మురారీ గదిలో ముకుంద లవ్స్ మురారీ అని రాశావు కదా.. దానిని మార్చింది మధునే అని చెబుతుంది. వాళ్ల దృష్టిలో వాళ్లంతా ఒకటే.. మనమే బయటనుంచి వచ్చిన వాళ్ళం.. మధు, మురారీ ఆదర్శ్ వీళ్ళని ఎప్పుడూ పూర్తిగా నమ్మకూడదు అని చెబుతుంది అలేఖ్య.

తప్పుని తప్పు అని చెప్పడంలోనో పెద్దరికం

అందరం కూర్చున్నారు కదా ఎవరికీ వారు కావాల్సింది తింటారు. నువ్వు కూడా కూర్చో అని రేవతి అని అంటూ భవానీ.. ముకుంద, కృష్ణ.. ఎందుకు ఇంకా రాలేదు అని అంటే.. పైన ఉన్నారు అని చెప్పిన అలేఖ్య.. ముకుంద తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు.. తను తెగ బాధపడిపోతోందని భవానీ తో చెబుతుంది. మధు కల్పించుకుని తప్పుని తప్పు అని చెప్పడంలోనో పెద్దరికం ఉంది అని అంటాడు. ప్రసాద్ కల్పించుకుని శెభాష్ ఫస్ట్ టైం చాలా కరెక్ట్ గా మాట్లాడావు.. అని అంటుంటే.. మాకు ఎవరికీ అనిపించింది నీకు ఎలా అనిపించిందని అలేఖ్య ని మధు నిలదీస్తాడు. ఇంతలో కృష్ణ వచ్చి.. సంబంధం లేకుండా ఏదేదో వాగేసి  ముకుంద ఏది అని అడుగుతుంది. ఇంతలో భవానీ ముకుంద తనకు ఎదో చెప్పాలనుకుంది.. నువ్వేమో..నేను నీకు చెప్పిన విషయం మరచిపోయావు.. అసలు ఏమనుకుంటున్నారు మీరిద్దరూ అని భవానీ అని అడుగుతుంటే.. అక్కడకు వచ్చిన ముకుంద.. సూపర్ అత్తయ్య మీరు..మీలో నచ్చింది నాకు ఇదే అనుకుంటుంది ముకుంద.

కృష్ణకు హాస్పటల్ కట్టించిన భవానీ..

క్యాంప్ కు వెళ్లేముందు నాకు సర్ ఫ్రైజ్ ఇస్తాననిఅన్నారు కదా ఏమిటి పెద్దత్తయ్య అది అని అడిగితే .. మీ అమ్మగారి కోరిక మేరకు పేదలకు ఉచితంగా వైద్యం చేస్తానని అన్నావు కదా అందుకే హాస్పటల్ కట్టించా అని భవానీ చెబుతుంది. అందరూ సంతోషంగా క్లాప్స్ కొట్టి అభినందిస్తారు. కృష్ణ తల్లితో తాను చిన్నతనంలో ఇచ్చిన మాటను గుర్తు చేసుకుని సంతోషపడుతుంది. మా అమ్మానాన్న చేసిన పుణ్య ఫలంతో ఈ ఇంటి కోడలు అయ్యా అని అంటే.. నా కోడలు కోసం నేను ఈ మాత్రం చెయ్యలేనా అంటూ.. ముకుంద తో 10 రోజుల్లో నీకు కూడా సర్ ఫ్రైజ్ ఉందని చెబుతుంది భవానీ.. అత్తయ్య ఆదర్శ్ తిరిగి రావడం నాకు సర్ ఫ్రైజ్ కాదు శాపం.. కృష్ణ ఏమి పుణ్యం చేసుకుంది .. నేను ఏ పాపం చేసుకున్నా అని ముకుంద అనుకుంటుంది. నువ్వు నాకు ఏదో చూపిస్తాను అన్నావు కదా ఏమిటి అది అని అడుగుతుంది భవానీ,.. ఇప్పుడు చెప్పేస్తే మురారీని ఇరికించిన దానిని అవుతా.. మురారీ ని ఒప్పించి అప్పుడే మేమిద్దరం కలిసి మా ప్రేమ విషయం చెప్పాలని ముకుంద అనుకుంటుంది. తన గది వాస్తు బాగోలేదని మురారీ రూమ్ వాస్తు బాగుంది.. అక్కడ మారాలని అనుకున్నా అంటే.. ఒక వారం రోజులు ఆగు మొత్తం సెట్ చేద్దామని అంటుంది భవానీ.. మరోవైపు అలేఖ్యని నీకు అనిపించిందో.. కల్పించొ చెప్పకు అని ముకుంద తిడుతుంది.

ఇవి కూడా చదవండి

కృష్ణ సెతస్కోప్ వెదుకుని 20 ఏళ్లకే ఇంత మతిమరుపు వస్తే.. 60 ఏళ్లలో నువ్వు నువ్వే చూసుకుని గొడవ పడుతూ ఉంటావు అని అనుకుంటుంటే.. ముకుంద…  కృష్ణతో నీతో తర్వాత గొడవ పదువుగానీ ఇప్పుడు నాతొ గొడవ పడుదువుగానీ రా అని అంటుంది. హాస్పటల్ కు నీతో వస్తా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి.. అని అంటుంటే.. ఇక్కడ చెప్పవచ్చు కదా.. అని అంటుంటే.. ఇక్కడే చెప్పెయ్యి అని అంటుంది కృష్ణ. ఏసీపీ సార్ కు మెసేజ్ చేస్తా అని అంటే.. నేను చెప్పే విషయం అయ్యేవరకూ సెల్ స్విచ్ ఆఫ్ చెయ్యి అని అని నామీద నీకు నమ్మకం లేదా అని అంటుంది ముకుంద.. నీ మీద నమ్మకం అంది అని కృష్ణ ముకుందతో కలిసి వెళ్ళుతుంది.

ఆదర్శ్ ని తీసుకుని రావడానికి ప్లాన్ చేస్తున్న భవానీ..

మురారిని పిలిచి బోర్డర్ యుద్ధం ముగిసిందట, అందరూ క్షేమంగానే ఉన్నారు. ఇప్పడు ఆదర్శ్ మళ్ళీ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతాడట.. కన్నల్ ఎంత చెప్పినా వినడం లేదట.. దీనికి కారణం నువ్వే కనిపెట్టాలి నాన్న అని భవానీ మురారీని అడుగుతుంది. నా కారణంగానే ఆదర్శ్ మన ఫ్యామిలీకి దూరం అయ్యాడు.. ఆదర్శ్ ని నేనే తీసుకొస్తా.. వాడు నా మాట తప్పకుండా వింటాడు.. అని మురారీ చెబుతాడు.

రేపటి ఎపిసోడ్ లో

మురారీని నాకు నువ్వు కావాలి.. నా ప్రేమని రిజెక్ట్ చేయకు.. నువ్వు లేని జీవితం నాకు వద్దు.. అని మురారీని హత్తుకున్న ముకుంద.. అది చూసి షాక్ లో కృష్ణ..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!