Jawan Moive: షారుఖ్ మూవీ జవాన్.. సత్య రాజ్ హీరోగా నటించిన సినిమాకు రీమేక్.. కథ ఒకటే అంటూ..
ఇప్పుడు ఈ జవాన్ సినిమా స్టోరీ కొత్తది కాదని.. గతంలో రిలీజైన సౌంత్ ఇండియా సినిమా స్టోరీనే అని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాదు జవాన్ సినిమా దక్షిణాదిలోని సినిమా అంటూ చిత్రం మూలాన్ని గుర్తించారు. 1989లో రిలీజైన తమిళ సినిమా ‘తాయ్ నాడు’ స్టోరీ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా స్టోరీని అని అంటున్నారు. తాయ్ నాడు అంటే తెలుగు లో 'మాతృభూమి' . ఈ సినిమాకు ఆర్. అరవింద్ రాజ్ దర్శకత్వం వహించారు. సత్యరాజ్ హీరోగా ద్విపాత్రాభినయంలో కనిపించారు.

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన ‘ జవాన్ ‘ రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జవాన్ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.. మరికొందరు సినిమా వసూళ్లు సాధిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 300 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పుడు ఈ జవాన్ సినిమా స్టోరీ కొత్తది కాదని.. గతంలో రిలీజైన సౌంత్ ఇండియా సినిమా స్టోరీనే అని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాదు జవాన్ సినిమా దక్షిణాదిలోని సినిమా అంటూ చిత్రం మూలాన్ని గుర్తించారు. 1989లో రిలీజైన తమిళ సినిమా ‘తాయ్ నాడు’ స్టోరీ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా స్టోరీని అని అంటున్నారు.
తాయ్ నాడు అంటే తెలుగు లో ‘మాతృభూమి’ . ఈ సినిమాకు ఆర్. అరవింద్ రాజ్ దర్శకత్వం వహించారు. సత్యరాజ్ హీరోగా ద్విపాత్రాభినయంలో కనిపించారు. ‘జవాన్’ లో కూడా తండ్రీ కొడుకుల పాత్రలే ప్రధానాశం. ‘తాయ్ నాడు’ సినిమాలో తండ్రి మిలటరీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అయితే.. హీరో తండ్రి శత్రువుల మాయలకు బలైపోతాడు. ప్రత్యర్థికి సమాచారాన్ని లీక్ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటాడు. ఆ తర్వాత హత్యకు గురవుతాడు. అయితే మిలటరీ మ్యాన్ ఆత్మహత్య చేసుకున్నాడని హత్యని సూసైడ్ గా మార్చేస్తారు. దీంతో తన తండ్రి మరణానికి కారణమైన వారిని వెదుకుతూ కొడుకు వెళ్తాడు. చివరకు తన తండ్రి నిజాయతీని నిరూపిస్తాడు. ఇదే కథ జవాన్ సినిమాది కూడా..




బాలీవుడ్ లో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘జవాన్’ సినిమాకు దర్శకుడు అట్లీ. దీంతో ఈ చిత్రంలో సౌత్ ఇండియన్ ఫ్లేవర్ కనిపిస్తుంది. ఈ ఐడియా అభిమానుల్లో ఆనందం నింపింది. అంతేకాదు జవాన్ అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ ఇండియాలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే వీకెండ్‌లో సినిమా వసూళ్లు ఎలా ఉంటాయనే విషయంపై లాంగ్ రన్ ను అంచనా వేస్తారు.
జవాన్ ఒరిజినల్ తమిళ వెర్షన్
ஜவான் ஒரிஜினல் தமிழ் வெர்ஷன் – 1989. pic.twitter.com/G0KD0u7Qb0
— மாடர்ன் திராவிடன் (@moderndravidan) September 7, 2023
‘జవాన్’ చిత్రంలో హీరోగా షారుక్ ఖాన్, విజయ్ సేతుపతి విలన్‌గా నటించగా.. ఇతర ప్రధాన పాత్రల్లో నయనతార, సన్యా మల్హోత్రా, ప్రియమణి తదితరులు నటించారు. యాక్షన్‌లో కంటే హావభావాల్లోనే విలనిజాన్ని పండించిన విజయ్ సేతుపతి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..