- Telugu News Photo Gallery Cinema photos actress soundarya death was already predicted she died in plane crash, actress was pregnant at the time of her death
Soundarya: చిన్న వయసులోనే మరణించిన సౌందర్య.. పుట్టిన వెంటనే మరణాన్ని ఊహించారా..! యాగాలు చేసినా మరణం తప్పలేదా..
చలన చిత్ర పరిశ్రమలో అందం, నటనతో చెరగని ముద్ర వేసిన నటి సౌందర్య. వాస్తవానికి చాలామంది యాక్టర్లు తాను డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతూ ఉంటారు. అయితే సౌందర్య సినిమాల్లో నటించక ముందు మెడిసిన్ చదివేది. మెడిసిన్ చదువుకునే సమయంలో సౌందర్యకు నటిగా సినిమా ఆఫర్ వచ్చింది. దీంతో చదువుకు గుడ్ బై చెప్పి నటిగా వెండి తెరపై అడుగు పెట్టింది.
Updated on: Jul 29, 2023 | 12:51 PM

సౌందర్య నటన, అందం, సింప్లిసిటీకి జనాలు ఆకర్షితులయ్యారు. సౌందర్య సినిమాల్లో హీరోయిన్ గా అడుగు పెట్టక ముందు మెడిసిన్ చదువుతోంది. డాక్టర్ మొదటి సంవత్సరంలో ఉండగా సౌందర్య తండ్రి స్నేహితుడు ఆమెకు సినిమా ఆఫర్ చేశాడు.

వాస్తవానికి కన్నడ సోయగం సౌందర్య అసలు పేరు సౌమ్య.. ఆమెకు చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం. ఒక్కసారిగా సినిమా ఆఫర్ అని విన్న వెంటనే చదువుకు గుడ్ బై చెప్పేసి.. కల నెరవేర్చుకుంది.

సౌందర్య కన్నడ చిత్రం గంధర్వతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ఆఫర్ ను సౌందర్య తండ్రి స్నేహితుడు ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడంతో సౌందర్య రాత్రికి రాత్రే సౌత్‌లో పెద్ద నటిగా మారిపోయింది.

టాలీవుడు లో మనవరాలి పెళ్లి సినిమాతో అడుగు పెట్టింది. ఇక్కడ కూడా తన నటన, అందంతో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్ గా ఆఫర్స్ ను అందుకుంది. తమిళ, తెలుగు, కన్నడ సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా నటించింది. అమితాబ్ బచ్చన్ సరసన 'సూర్యవంశం'లో సౌందర్య అరంగేట్రం చేసింది. 12 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా చిత్రాల్లో నటించింది.

అయితే ఎప్పుడూ నవ్వుతూ ఉండే సౌందర్య చిన్న వయసులో మరణిస్తుందని ఎవరూ అనుకోలేరు. కేవలం 31 ఏళ్లకే ప్రపంచానికి వీడ్కోలు పలికింది. ఓ వైపు సినీ పరిశ్రమలో తనకంటూ పేరు సంపాదించుకున్న సౌందర్య రాజకీయాల్లో కూడా అడుగు పెట్టింది. బీజేపీ పార్టీలో చేరింది. పార్టీ ర్యాలీకి సంబంధించి ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రైవేట్ విమానంలో కరీంనగర్‌కు వెళ్తున్న సౌందర్య ప్రమాదంలో మరణించింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది.

అయితే సౌందర్య పుట్టిన సమయంలో ఒక జ్యోతిష్యుడు ఆమె అకాల మరణాన్ని అంచనా వేసినట్లు చెబుతారు. ఆమె అకాల మరణాన్ని జయించడానికి సౌందర్య తల్లిదండ్రులు అనేక పూజలు, యాగాలు చేశారు. అయితే విధి రాతను ఎవరూ మార్చలేరు అన్న పెద్దల మాటను నిజం చేస్తూ కెరీర్‌లో పీక్ స్టేజ్ కు చేరుకున్న సమయంలో సౌందర్య ప్రపంచానికి వీడ్కోలు పలికింది.

ఈ విమాన ప్రమాదంలో సౌందర్య, ఆమె అన్న సహా మరో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాద సమయంలో సౌందర్య రెండు నెలల గర్భవతి కూడా. సౌందర్య మరణించడానికి ఒక సంవత్సరం ముందు 2003లో తన చిన్ననాటి స్నేహితుడు , సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన GS రఘుని వివాహం చేసుకుంది.





























