- Telugu News Photo Gallery Cinema photos Saiyami Kher Bollywood Actress Cricket played Movie Ghoomar Trailer release share unknown facts in Telugu
Saiyami Kher: పారా క్రికెటర్.. ఒంటిచేతి బౌలర్‌గా సయామీ ఖేర్ ‘ఘూమర్’.. నిజజీవితంలో క్రీడాకారిణి అని మీకు తెలుసా..
సయామీ ఖేర్ నటించిన ఘూమర్ ట్రైలర్ విడుదలైంది. ఆర్. బాల్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 18, 2023న విడుదల కానుంది. సినిమాలో పారా క్రికెటర్ గా కనిపిస్తున్న సయామీ ఖేర్ కి ఈ ఆట కొత్తకాదు. ఆమె దేశీయ స్థాయిలో క్రికెట్ ఆడింది.
Updated on: Aug 06, 2023 | 12:58 PM

సయామీ ఖేర్ నటించిన ఘూమర్ ట్రైలర్ విడుదలైంది. ఆర్. బాల్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 18, 2023న విడుదల కానుంది. సినిమాలో పారా క్రికెటర్ గా కనిపిస్తున్న సయామీ ఖేర్ కి ఈ ఆట కొత్తకాదు. ఆమె దేశీయ స్థాయిలో క్రికెట్ ఆడింది.

బాలీవుడ్ లో స్పోర్ట్స్ నేపథ్యంలో అందునా క్రికెట్.. క్రికెటర్ జీవిత నేపథ్యం లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతేకాదు OTT లో కూడా క్రికెట్ , క్రీడలపై చాలా మంచి కంటెంట్ తో ఉన్న వెబ్ సిరీస్ లు వచ్చాయి. ప్రేక్షకులను అలరించాయి కూడా. ఇప్పుడు సయామీ ఖేర్ నటించిన కొత్త వెబ్ సిరీస్ చర్చలో ఉంది. దీని పేరు ఘూమర్. (ఫోటో క్రెడిట్- @saiyami)

ఇటీవలే విడుదలైన ఘూమర్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో సయామి ఒక చేయి విరిగిపోయిన మహిళా క్రికెటర్ పాత్రలో నటించింది. తన చేతిని కోల్పోయిన క్రీడాకారిణి నిరుత్సాహ పడకుండా క్రికెట్ ఆడుతూనే ఉంది (ఫోటో క్రెడిట్- @saiyami)

అయితే సయామీ ఖేర్ కు మళ్ళీ క్రికెట్ ఆడటానికి అవకాశం దక్కింది. భారత క్రికెట్ జట్టు ఆహ్వానించడం యాదృచ్చికం. సయామీ ఖేర్ నటి మాత్రమే కాదు.. మంచి క్రీడాకారిణి.. చిన్నతనం నుంచి క్రికెట్ ఆడుతూనే పెరిగిన సయామీ.. దేశవాళీ క్రికెట్ పోటీల్లో ఆడింది కూడా.. (ఫోటో క్రెడిట్- @saiyami)

సయామీ ఖేర్ అమ్మమ్మ ఒకప్పటి నటి ఉషా కిరణ్. ఆమె మేనత్త తన్వీ అజ్మీ కూడా నటి. సయామి తల్లి ఉత్తర మాత్రే ఖేర్ మాజీ మిస్ ఇండియా. సయామి తండ్రి గురించి మాట్లాడితే అద్వైత్ ఖేర్ ఒక సూపర్ మోడల్. (ఫోటో క్రెడిట్- @saiyami)

మరోవైపు సయామీ ఖేర్ గురించి చెప్పాలంటే.. ఆమెకు నటనతో పాటు క్రీడలపై కూడా చాలా ఆసక్తి ఉంది. సైనా నెహ్వాల్‌తో కలిసి బ్యాడ్మింటన్ ఆడింది. ఇది కాకుండా ఆమె క్రికెట్ కూడా ఆడింది. ఆమె మహారాష్ట్ర క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్‌గా ఆడింది. అదే సమయంలో సయామీకి భారత జాతీయ జట్టులో ఎంపిక అయ్యి.. పిలుపు అందుకుంది. (ఫోటో క్రెడిట్- @saiyami)

అయితే సయామి తన తల్లిలా మోడలింగ్‌లో ప్రయత్నించింది. తన క్రికెట్ కెరీర్‌ను వదులుకుంది. క్రికెట్‌తో పాటు స్విమ్మింగ్ కూడా ఇష్టం. నటి ఘూమర్ చిత్రం గురించి మాట్లాడుతూ.. అభిషేక్ బచ్చన్ తన కు కోచ్ పాత్రలో నటించినట్లు చెప్పింది. (ఫోటో క్రెడిట్- @saiyami)





























