Bigg Boss 7 Telugu: ‘పట్టు చీరల్లో చందమామ.. ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా’.. ఈ ముద్దుగుమ్మ బిగ్‏బాస్‏లో బ్యూటీ.. గుర్తుపట్టండి..

ఈసారి హౌస్ లోకి ఏడుగురు అమ్మాయిలు హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో పైన ఫోటోలో కనిపిస్తోన్న అమ్మాయి కూడా ఉంది. చూశారు కాదా. ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టేశారా ?. తొలిరోజే బిగ్‏బాస్ వేదికపై మంచి పెర్ఫామెన్స్ ఇచ్చి ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. యాక్టర్ కాకముందు లాయర్ అంటూ చెప్పేసింది. ఎవరో గుర్తుపట్టారా ?.

Bigg Boss 7 Telugu: 'పట్టు చీరల్లో చందమామ.. ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా'.. ఈ ముద్దుగుమ్మ బిగ్‏బాస్‏లో బ్యూటీ.. గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 08, 2023 | 10:02 PM

బిగ్‏బాస్ సీజన్ 7 ప్రారంభమై విజయవంతంగా రన్ అవుతోంది. ఈసారి మొత్తం 14 మంది హౌస్‏లోకి అడుగుపెట్టగా.. మొదటి వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యింది 8 మంది. ఇక ఈసారి హౌస్ లోకి ఏడుగురు అమ్మాయిలు హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో పైన ఫోటోలో కనిపిస్తోన్న అమ్మాయి కూడా ఉంది. చూశారు కాదా. ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టేశారా ?. తొలిరోజే బిగ్‏బాస్ వేదికపై మంచి పెర్ఫామెన్స్ ఇచ్చి ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. యాక్టర్ కాకముందు లాయర్ అంటూ చెప్పేసింది. ఎవరో గుర్తుపట్టారా ?. తనే హీరోయిన్ శుభశ్రీ రాయగురు.

సమ్మోహనుడా పాటకు మంచి ఊపిచ్చే పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఒడిశాకు చెందిన ఈ బ్యూటీ నటి కాకముందు లాయర్ గా పనిచేసింది. ఆ సమయంలోనే నటనపై ఆసక్తి ఉండడంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. VLCC ఫెమినా మిస్ ఇండియా ఒడిశా 2020 టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత యాంకర్ గా మారి అనేక లైవ్ షోస్ చేసింది. క 2022లో రుద్రవీణ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత డెవిల్ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. ప్రస్తుతం బిగ్‏బాస్ సీజన్ 7లో పాల్గొంది. అయితే ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి గౌతమ్ కృష్ణతో ఫ్రెండ్ షిప్ మెయింటెన్ చేస్తోంది శుభశ్రీ. ఇప్పటివరకు టాస్కులలో చురుగ్గా పాల్గొంటుంది. శుభశ్రీకి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ చిత్రంలోనూ నటించింది శుభశ్రీ. ఈ చిత్రానికి సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా.. కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల విడుదైలన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. పవర్ స్టార్ సినిమాలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం అని తెలిపింది శుభశ్రీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.