Bigg Boss 7 Telugu: రతిక మాయలో పడ్డ రైతు బిడ్డ.. ‘అది నా పిల్ల’ అంటూ ప్రేమమైకంలో ప్రశాంత్..

ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఓవైపు గౌతమ్ కృష్ణ, శుభశ్రీ మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రాగా.. మరోవైపు పల్లవి ప్రశాంత్, రతికలకు లవ్ ట్రాక్ పడింది. రైతు బిడ్డను.. బిగ్‏బాస్ విన్నర్ అవుతానంటూ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. ఇప్పుడు పూర్తిగా రతిక మాయలో పడిపోయారు. రోజంతా రతిక చుట్టే తిరుగుతున్నాడు. ప్రశాంత్ విషయంలో రతిక క్లారిటీగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రశంత్ మాత్రం ఆమెపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

Bigg Boss 7 Telugu: రతిక మాయలో పడ్డ రైతు బిడ్డ.. 'అది నా పిల్ల' అంటూ ప్రేమమైకంలో ప్రశాంత్..
Bigg Boss 7 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 09, 2023 | 7:40 AM

బిగ్‏బాస్ ఇంట్లో ప్రతి సీజన్ లో ఉండే గాసిప్స్.. లవ్ ట్రాక్స్ ఇప్పుడు సీజన్ 7లోనూ మొదలయ్యాయి. షకీలా, టేస్టీ తేజలను స్వయంగా పిలిచి ఇంట్లోని గాసిప్స్ బయటపెట్టాలని ఆర్డర్ వేశాడు బిగ్‏బాస్. దీంతో ఇంట్లో జరుగుతున్న ప్రేమకథలపై పెదవి విప్రారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఓవైపు గౌతమ్ కృష్ణ, శుభశ్రీ మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రాగా.. మరోవైపు పల్లవి ప్రశాంత్, రతికలకు లవ్ ట్రాక్ పడింది. రైతు బిడ్డను.. బిగ్‏బాస్ విన్నర్ అవుతానంటూ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. ఇప్పుడు పూర్తిగా రతిక మాయలో పడిపోయారు. రోజంతా రతిక చుట్టే తిరుగుతున్నాడు. ప్రశాంత్ విషయంలో రతిక క్లారిటీగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రశంత్ మాత్రం ఆమెపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆమెతో ఎవరైనా మాట్లాడినా, క్లోజ్ గా మూవ్ అయినా తట్టుకోలేకపోతున్నాడు. దీంతో మిగతా కంటెస్టెంట్స్ సైతం ప్రశాంత్ ను ఏడిపించేందుకు రతికతో క్లోజ్ గా ఉంటున్నట్లు ప్రయత్నిస్తున్నారు.

నిన్నటి ఎపిసోడ్ లో టేస్టీ తేజను రతికతో బాబాయ్ అని పిలిపించాడు ప్రశాంత్. ఈ విషయాన్ని అందరి ముందు బయటపెడుతూ ఎందుకు పిలవమన్నావ్ అంటూ అడిగేసింది రతిక. దమ్ముంటే బాబాయ్ అని పిలువ్ అన్నావ్ కదా.. నువ్వు పిలవమంటే పిలిచాను.. నీకు హర్ట్ అయ్యింది కదా అంటూ గుర్తుచేసింది. దీంతో నాక్ ఫిలింగ్స్ నువ్ ఎందుకు పట్టించుకుంటున్నావ్ అన్నట్లుగా అడిగాడు ప్రశాంత్. ఇక అక్కడే ఉన్న శివాజీ ఏయ్ అది నా పిల్ల అనమని చెప్పగా.. వెంటనే నా పిల్ల అంటూ అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ప్రశాంత్.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

అయితే రతిక విషయంలో ప్రశాంత్ ప్రవర్తన పై ఇంట్లో వారికి కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక ఇదే విషయాన్ని రతిక ఒంటరిగా ఉన్నప్పుడు సుభా శ్రీ సూటిగానే అడిగేసింది. నీకు ప్రశాంత్ మీద ఇంట్రెస్ట్ ఉందా అని అడగ్గా.. పర్సన్ పరంగా ఇష్టమని చెప్పుకొచ్చింది రతిక. పర్సన్ గా అంటే ఎలా అని మళ్లీ సుభా శ్రీ అడగ్గా.. ఫ్రెండ్ లాగా అంటూ చెప్పుకొచ్చింది. కానీ ప్రశాంత్ కు నీమీద ఇంట్రస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది అని సుభాశ్రీ చెప్పగా.. అది గేమ్ కోసమా.. లేదంటే నిజంగానా అనేది తనకు అర్థం కావట్లేదని తెలిపింది రతిక. మొత్తానికి రతిక విషయాన్ని మాత్రం ప్రశాంత్ సీరియస్ గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.