Rakul Preet Singh: లగ్జరీ కారు కొన్న రకుల్ ప్రీత్.. ఎన్ని కోట్లుంటుందో తెలుసా ?..

తెలుగులో చివరిసారిగా కొండపొలం చిత్రంలో కనిపించింది రకుల్. ఇటు తెలుగులో దూకుడు తగ్గించిన రకుల్.. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. గతేడాది అటాక్, రన్ వే 34, కట్ పుట్లి, డాక్టర్ జి వంటి చిత్రాల్లో నటించింది. అలాగే బూ సినిమాతో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Rakul Preet Singh: లగ్జరీ కారు కొన్న రకుల్ ప్రీత్.. ఎన్ని కోట్లుంటుందో తెలుసా ?..
Rakul Preet Singh
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 09, 2023 | 6:43 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది రకుల్. స్టార్ హీరోస్ అందరి సరసన స్క్రీన్ షేర్ చేసుకుని తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొంతకాలంగా ఆమెకు అంతగా అవకాశాలు రావడంలేదు. తెలుగులో చివరిసారిగా కొండపొలం చిత్రంలో కనిపించింది రకుల్. ఇటు తెలుగులో దూకుడు తగ్గించిన రకుల్.. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. గతేడాది అటాక్, రన్ వే 34, కట్ పుట్లి, డాక్టర్ జి వంటి చిత్రాల్లో నటించింది. అలాగే బూ సినిమాతో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

శుక్రవారం (సెప్టెంబర్ 8)న రకుల్ Mercedes-Benz Maybach GLSని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆ కారు ముందు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేకాకుండా అక్కడున్నవారికి స్వీట్స్ పంచి తన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంది. రకుల్ కొనుగోలు చేసిన కారు విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. రకుల్ కు అభినందనలు తెలుపుతున్నారు నెటిజన్స్.

ఇదిలా ఉంటే.. అర్జున్ కపూర్, భూమి ఫెడ్నేకర్ లతో కలిసి మేరే హస్బెండ్ కి బివి చిత్రంలో నటిస్తోంది రకుల్. గతేడాది షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అలాగే అజయ్ దేవగన్ నటిస్తోన్న దే దే ప్యార్ దే 2 చిత్రంలోనూ కనిపించనుంది. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో కథానాయికగా అడుగుపెట్టింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన నటించింది.

ఇక తాజాగా విడుదలైన జవాన్ సినిమాపై ప్రశంసలు కురిపించింది రకుల్. జవాన్ సినిమాపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదని.. మీ మాయాజలానికి ప్రపంచమే ఉలిక్కిపడింది అంటూ ఫైర్ ఎమోజీలు షేర్ చేసింది. ఈ సినిమాలో నయన్ మరింత అందగా కనిపించందని.. అలాగే దీపిక పాత్ర అద్భుతంగా ఉందని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.