AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుర్ర హీరోలను రెమ్యునరేషన్లో.. దాటేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు

కుర్ర హీరోలను రెమ్యునరేషన్లో.. దాటేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 10, 2026 | 4:53 PM

Share

ఒకప్పుడు హీరోలదే ఆధిపత్యం అనుకుంటే, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు రెమ్యునరేషన్లలో పోటీపడుతున్నారు. తమ బీట్స్‌తో సినిమాలకు ప్రాణం పోస్తూ, స్టార్ డైరెక్టర్లు భారీ పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారు. అనిరుధ్ 23 కోట్లు, దేవిశ్రీ 12 కోట్లు, తమన్ 10 కోట్లు, రెహమాన్ 15 కోట్లతో నిర్మాతల బడ్జెట్ అంచనాలను మార్చేస్తున్నారు. వీరి క్రేజ్ హీరోలకు దీటుగా పెరిగింది.

ఒకప్పుడు సినిమాలో హీరోలదే ఫుల్ డామినేషన్.. కానీ ఇప్పుడు హీరోలతో పాటు మరొకరి డామినేషన్ కూడా కనిపిస్తుంది. వాళ్లెవరో కాదు మ్యూజిక్ డైరెక్టర్లు.. సినిమా సినిమాకూ ఆస్తులు రాయించుకునే రేంజ్‌లో రెమ్యునరేషన్స్ పెంచేసి ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే సినిమాలను బ్లాక్‌బస్టర్స్ చేస్తున్న ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు.. ఎవరెవరు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో చూద్దాం..! తన బీట్స్‌తో ఇండస్ట్రీని ఊపేస్తున్న అనిరుధ్.. రెమ్యునరేషన్‌తో నిర్మాతలను వణికిస్తున్నారు. లోకేష్ కనకరాజ్, బన్నీ కాంబోలో రాబోతున్న AA23 సినిమాకు ఈయన ఏకంగా 23 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తుంది. అలాగే పుష్ప 2 తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక్కో సినిమాకు 12 కోట్ల వరకు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉస్తాద్‌తో బిజీగా ఉన్నారీయన. టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న తమన్ సైతం తన రేట్ పెంచేసి.. ఒక్కో ప్రాజెక్టుకు 10 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్ నడుస్తుంది. చేతిలో ఎన్ని సినిమాలున్నా కరెక్ట్‌గా అనుకున్న టైమ్‌లో బెస్ట్ ఔట్‌పుట్ ఇస్తారనే మంచి పేరు ఉండటమే.. తమన్ కెరీర్‌కు శ్రీరామరక్షలా మారుతుంది. అదే ఆయనకు అవకాశాలు క్యూ కట్టేలా చేస్తోంది. ఇక ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సైతం తన రేంజ్‌కు ఏ మాత్రం తగ్గట్లేదు. పెద్ది సినిమా కోసం దాదాపు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లంతా తమ క్రేజ్‌తో రెమ్యునరేషన్స్‌లో కుర్ర హీరోలను సైతం దాటేస్తూ.. సినిమాల బడ్జెట్ లెక్కలను కూడా మార్చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Drishyam 3: ‘దృశ్యం 3’కి వెంకీ నో చెప్పారా.. కారణం అదేనా

Indian 3: ఇండియన్‌ 3… శంకర్‌కి క్లారిటీ వచ్చిందా ??

Dhurandhar 2: తెలుగు ధురంధర్‌2 లో పాటలు ఉండవా.. ఇదేం మ్యాజిక్

వెంకీ – కల్యాణ్‌రామ్‌ సినిమా పూర్తయ్యేది అప్పుడేనా

Ramayana: మార్చి నుంచి రామాయణ నయా షెడ్యూల్‌

Published on: Mar 10, 2026 04:53 PM
Follow Us