AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెంకీ - కల్యాణ్‌రామ్‌ సినిమా పూర్తయ్యేది అప్పుడేనా

వెంకీ – కల్యాణ్‌రామ్‌ సినిమా పూర్తయ్యేది అప్పుడేనా

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 10, 2026 | 4:43 PM

Share

అనిల్ రావిపూడి తన చిత్రాల ద్వారా అవార్డులు ఆశించలేదని, నిజాయితీగా సినిమాలు తీయడమే తన లక్ష్యమని తెలిపారు. 'భగవంత్ కేసరి'కి జాతీయ అవార్డు చర్చలు, 'సరిలేరు నీకెవ్వరు'లో పాపా పాండే సీన్ స్క్రీన్‌ప్లే మార్పులు వంటి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో తదుపరి సినిమా జూన్ నుండి ప్రారంభమై, వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

చేయబోయే సినిమాల గురించే కాదు, ఆల్రెడీ రిలీజ్‌ అయి క్లిక్‌ అయిన సినిమాల గురించిన వార్తలు కూడా సూపర్‌ కిక్‌ ఇస్తాయి. ఇప్పుడు అనిల్‌ రావిపూడి ప్రీవియస్‌ ఫిల్మ్స్ కి సంబంధించిన ఇన్‌సైడ్‌ విషయాలు అలాగే వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఏంటవి? తానెప్పుడూ అవార్డులు అందుకోవాలనే లక్ష్యంతో కథలు రాసుకోలేదన్నది అనిల్‌ రావిపూడి చెప్పే మాట. భగవంత్‌ కేసరి సినిమాకు కూడా జాతీయ పురస్కారం వస్తుందనిగానీ, రావాలనిగానీ ముందు ఊహించలేదని అన్నారు. అనకున్నది అనుకున్నట్టు నిజాయతీగా తెరకెక్కించడమే తన స్టైల్‌.. దానికి గుర్తింపు దక్కడం మహదానందం అంటున్నారీ కెప్టెన్‌. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలోనూ స్క్రీన్‌ ప్లే కీ రోల్‌ ప్లే చేసిందట. పాపా పాండేని ఐశ్వర్యరాజేష్‌ తోసేసే సీన్‌ని ముందు ఇంటర్వెల్‌లో ప్లాన్‌ చేశారట. అయితే అప్పటికే ఫస్టాఫ్‌ స్టఫ్డ్ గా ఉండటంతో, సెకండ్‌ హాఫ్‌కి షిఫ్ట్ చేశారట. సరికొత్త కంటెంట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇంక్లూడ్‌ చేసే అనిల్‌ రావిపూడి… వెంకటేష్‌ – కల్యాణ్‌ రామ్‌ సినిమాను కూడా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేస్తున్నారు. జూన్‌, జులై నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. నవంబర్‌కి కంప్లీట్‌ చేసి, వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ramayana: మార్చి నుంచి రామాయణ నయా షెడ్యూల్‌

Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..

స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ నిర్వాకం.. పిల్లలతో మసాజ్‌..

రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..

లైవ్ వీడియోలో యూట్యూబర్‌ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్

Published on: Mar 10, 2026 04:42 PM
Follow Us